వైసిపికి దడ పుట్టిస్తున్న ఈడీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. త్వరలో కేతిరెడ్డికి కూడా?

0
6

వైసిపి నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భయం పట్టుకుంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు, మద్యం రవాణా టెండర్ల కుంభకోణాన్ని విచారిస్తున్న ఈడీ వైసిపికి చుక్కలు చూపిస్తోంది. తాజాగా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 14న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. హత్య కేసులో నిందితులకు జరిగినట్లు అనుమానిస్తున్న చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది.

వివేకాను అంతమొందించేందుకు రూ. 40 కోట్ల సుపారీ డీల్ కుదిరిందనే సంచలన కోణాన్ని దర్యాప్తు సంస్థలు వెలికితీయడంతో, ఈ నిధులు ఎవరి నుంచి ఎవరికి చేరాయన్న కోణంలో ఈడీ విచారణ జరపుతా వుంది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, అలాగే సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డిల బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిశితంగా పరిశీలించిన ఈడీ… హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన కోట్లాది రూపాయల నగదు బదిలీల మూలాలు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల కనుసన్నల్లోనే సాగాయని అనుమానిస్తోంది. సెప్టెంబర్ 25న నిందితుడు యాదటి సునీల్ యాదవ్‌ను, సెప్టెంబర్ 29న ఏ1 ఎర్ర గంగిరెడ్డిని, ఏ3ఉమామహేశ్వరరెడ్డిని ఈడీ విచారించింది. సిసిఫుటేజిలు, కాల్ రికార్డులు వాళ్ల ముందు పెట్టి ప్రశ్నించి, కీలకసమాచారం రాబట్టిన అనంతరం ఈ కేసులో ఏ 7గా వున్న అవినాష్‌రెడ్డికి సమన్లు పంపారు.

హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని కూడా ఈడీ విచారించింది. సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి ఈ హత్యకేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. హత్య కోసం రూ.40 కోట్ల కాంట్రాక్ట్ కుదిరిందన్న ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. దస్తగిరికి రూ.1 కోటి అడ్వాన్స్, మరో రూ.4 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఈడీ పరిశీలిస్తోంది. 2019 నుంచి నిందితులతో సంబంధం ఉన్న బ్యాంకు లావాదేవీలు, నిధుల బదిలీలను పరిశీలిస్తూ మనీలాండరింగ్‌కు సంబంధించిన నగదు ప్రవాహాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తోంది.

అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కుట్ర అమలులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలదే ప్రధాన పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థ తన చార్జిషీట్లలో ఇదివరకే తేల్చింది. సాక్ష్యాల విధ్వంసం, ఘటనా స్థలంలో ‘గుండెపోటు’ డ్రామా నుంచి మొదలుకొని, హంతకులకు రక్షణ కల్పించడం వరకు ప్రతి అడుగులోనూ వీరి ప్రమేయం ఉందనడానికి సీబీఐ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. సీబీఐ గుర్తించిన ఆ క్రిమినల్ నెట్‌వర్క్‌కు, ఈడీ సేకరిస్తున్న నల్లధనం మనీ లాండరింగ్ వివరాలు తోడయితే అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసు నుంచి బయటపడటం కష్టమే.

ఇక మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే వైసిపి నేతలు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ జైల్లో వున్నారు. ఇంకో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు విచారణకు రావాలని మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే మొదటిసారి నోటీసు సకాలంలో అందలేదని సాకు చెప్పారు. మూడోసారి ఇచ్చిన నోటీసుకు తన ఆరోగ్యం బాగాలేదు, స్టంట్ వేయించుకున్నానని బాగుపడ్డాక వస్తానని విచారణకువెళ్లలేదు. తాజాగా చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానందరెడ్డికి కూడా నోటీసులిచ్చారు. అయితే అతను కూడా విచారణకు హాజరు కాలేదు.

త్వరలోనే ఈ కుంభకోణానికి సంబంధించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, గుడ్మానింగ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి కూడా నోటీసులిస్తారన్న వార్తలొస్తున్నాయి. టోటల్ గా జగన్ స్థాయి నేతలేమో మద్యం డిస్టిలరీల దగ్గర కమీషన్లు తీసుకుని ఖజానాకునష్టం చేసిన కేసులో ఇరుక్కుంటే,, ఆ తరువాత స్థాయి నేతలు రవాణా కుంభకోణంలో ఇరుక్కున్నారు. మద్యం కేసు, వివేకా కేసులో ఈడీ దూకుడుకు ఎవ్వరూ అడ్డుకట్ట వెయ్యకపోతే, వైసిపి ప్రముఖ నేతలంతా జైలు పాలు అయ్యే అవకాశం వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.