ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం..!

0
7

ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ ఒక భారీ సంచలనానికి తెరలేపింది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను మళ్లీ ముంబై ఇండియన్స్ సారథిగా నియమించడానికి యాజమాన్యం సిద్ధమైంది. మూడు సంవత్సరాల క్రితం రోహిత్ స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ప్రదర్శనపై మేనేజ్‌మెంట్ ఏమాత్రం సంతృప్తిగా లేదని జాతీయ మీడియా పేర్కొంది. హార్దిక్ నాయకత్వంలో ముంబై కేవలం ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో, ఈసారి కెప్టెన్‌ను మార్చడమే కాకుండా అతడిని వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయడానికి కూడా ముంబై మేనేజ్‌మెంట్ ఓపెన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం విమానం ఎక్కడానికి ముందే ముంబై మేనేజ్‌మెంట్ అతడితో సుదీర్ఘ చర్చలు జరిపింది. జట్టును మళ్లీ లీడ్ చేయాలంటూ ఫ్రాంచైజీ కోరగా, మొదట రోహిత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ పేరును లాంగ్-టర్మ్ ఆప్షన్‌గా సూచించినట్లు టాక్. కానీ యాజమాన్యం గట్టిగా రిక్వెస్ట్ చేయడంతో ఎట్టకేలకు రోహిత్ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అంగీకరించారు. ఈ లీడర్‌షిప్ రేసులో సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు ఉన్నప్పటికీ ముంబై మాత్రం రోహిత్ వైపే మొగ్గు చూపింది. ఒకవేళ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ డీల్ వర్కవుట్ కాకపోతే, అతను రోహిత్ కెప్టెన్సీ కింద ఆడటానికి కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.

ఈ కెప్టెన్సీ మార్పుతో పాటు ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ స్టాఫ్‌ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఈ సరికొత్త కోచింగ్ ప్యానెల్ నియామకంలో కూడా రోహిత్ శర్మ సలహాలను మేనేజ్‌మెంట్ తీసుకుంది. మహేల జయవర్ధనే స్థానంలో ముంబై మాజీ లెజెండ్ కీరన్ పొలార్డ్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. వీరితో పాటు బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఉతప్ప, బౌలింగ్ కోచ్‌గా కివీస్ మాజీ పేసర్ మిచెల్ మెక్‌క్లెనగన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ మున్ముందు ముంబై ఫీల్డింగ్ బాధ్యతలను, ధావల్ కుల్కర్ణి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ మళ్లీ సారథిగా రావడం, సరికొత్త కోచింగ్ బృందం ఎంట్రీ ఇవ్వడంతో ముంబై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.