ఈ రోజే సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..!

0
9

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కొట్టివేస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. నేడు మధ్యాహ్నానికల్లా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, లీగల్ టీమ్‌ను ఆదేశించారు.

బీసీల రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దించాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బీసీలకు చట్టబద్ధంగా 34 శాతం కోటాను ఎలా నిలబెట్టుకోవాలనే అంశంపై ఇప్పటికే ఢిల్లీలోని న్యాయ నిపుణులతో సీఎంతో పాటు అడ్వకేట్ జనరల్ విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లీగల్ వ్యూహాల ప్రకారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలవుతుండటంతో.. న్యాయపరమైన చిక్కులు వీడే వరకు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.