సొంత పార్టీలోనే జగన్ పై విమర్శలు..!

0
7

ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్-2026 సదస్సుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకాకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వ్యవహారంలో అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. జగన్ ఈ సదస్సుకు వెళ్లకపోవడాన్ని ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ అయిన వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా ప్రతినిధులే తీవ్రంగా తప్పుబడుతుండటం గమనార్హం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ తీవ్ర రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, జాతీయ మీడియా వేదికగా పార్టీ వాణిని బలంగా వినిపించే ఇంతటి గొప్ప అవకాశాన్ని జగన్ చేజేతులా వదిలేసుకున్నారంటూ పార్టీ అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిజానికి, ఈ కాంక్లేవ్‌కు తమను ఆహ్వానించలేదంటూ మొదట్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ, ఈ అబద్ధపు ప్రచారానికి ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అక్షిత నందగోపాల్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అనేక సార్లు అధికారికంగా ఆహ్వానించామని, కానీ వారి నేతలే ఈ సదస్సుకు రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ వాస్తవం బయటపడటంతో వైసీపీ కేడర్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఎలాగూ లేదు, కనీసం ఇలాంటి జాతీయ వేదికలపైకైనా వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా.. ప్రశ్నలకు భయపడి పారిపోవడం ఏంటని సొంత పార్టీ వారే అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.