తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌కు అరెస్ట్ గండం..?

0
3

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు ఆయన భార్య పుష్పపై నమోదైన రూ.3 కోట్ల చీటింగ్ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ‘ఏపీజే ఇంప్లెక్స్’ కంపెనీ కోసం విజయవాడకు చెందిన ప్రముఖ ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ నుండి వీరు భారీ రుణం పొంది, ఆ తర్వాత చెల్లింపులు ఆపేసి మోసానికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆర్థిక మోసంపై ఫైనాన్స్ ప్రతినిధులు ఇచ్చిన పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తును అత్యంత వేగవంతం చేశారు.

ఈ కేసులో త్వరలోనే పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు సేకరించిన ప్రాథమిక ఆధారాలు మాజీ ఎమ్మెల్యేను తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. 2019లో తాను ఎమ్మెల్యేగా ఉన్న అండతో, అధికార బలమిని వాడుకుని తెనాలిలోని 1,200 గజాల స్థలాన్ని ఐకేఎఫ్ ఫైనాన్స్ వద్ద తాకట్టు పెట్టి ఈ రూ.3 కోట్ల లోన్ తీసుకున్నారు. అయితే, సదరు స్థలంలో 500 గజాల భూమిని ఫైనాన్స్ సంస్థకు తాకట్టు పెట్టడానికంటే ముందే ఆయన ఇతరులకు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ రికార్డుల ద్వారా పోలీసులు గుర్తించారు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయన పేరిట కేవలం 700 గజాలు మాత్రమే ఉండగా, లోన్ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లు లేదా నకిలీ వివరాలతో కూడిన పత్రాలను సృష్టించి ఫైనాన్స్ కంపెనీని బురిడీ కొట్టించారనే బలమైన ఆధారాలు పోలీసులకు దొరికాయి. ప్రభుత్వ ఉద్యోగులను లేదా రిజిస్ట్రేషన్ అధికారులను ప్రభావితం చేసి తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు ఆయన భార్య పుష్ప, సహచరుడు తూనుగుంట్ల శ్రీనివాస శివరామ్‌లపై జాలీ రిజిస్ట్రేషన్ పత్రాల సృష్టి, నమ్మకద్రోహం, చీటింగ్ వంటి కఠినమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.. పత్రాల ఫోర్జరీ మరియు భారీ ఆర్థిక మోసం జరిగినట్లు ప్రాథమికంగా స్పష్టమవడంతో, వీరికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదని, ఏ క్షణంలోనైనా పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపే ఛాన్స్ ఉందని జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా టాక్ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.