ఏపీకి అండగా కేంద్రం.. సీఎంకు మోడీ ఫోన్..!

0
3

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విరుచుకుపడిన ‘అర్నబ్’, ‘మురసు’ తుపాన్ల ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులు మరియు బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి సీఎం చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.

ఈ సంభాషణలో, తుపాను సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు అనుసరించిన ముందస్తు వ్యూహాలు, నిరంతర పర్యవేక్షణపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రం ద్వారా యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ, ప్రాణనష్టం జరగకుండా భారీ విపత్తును సమర్థవంతంగా అధిగమించిన తీరును అభినందించారు.

కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను తక్షణమే అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి లభిస్తున్న వేగవంతమైన మద్దతుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.