Skip to content
ట్రెండింగ్
ఫాలో అవ్వండి
బ్రేకింగ్
పంచాయతీ పోరులో టీడీపీ కొంపముంచుతున్న మండల అధ్యక్షులు..!గన్నవరంలో టీడీపీకి డేంజర్ బెల్స్..?శాండ్‌పేపర్‌గేట్ వివాదాన్ని మళ్లీ రాజేసిన ఉస్మాన్ ఖవాజా..!వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఆ నాయకుడే కారణమా..?వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్..?తెలుగులో బాలీవుడ్ సినిమాలకు 100 కోట్లు కలేనా..?డిసెంబర్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు..!హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేవంత్ మాస్ ప్లాన్..!పంచాయతీ పోరులో టీడీపీ కొంపముంచుతున్న మండల అధ్యక్షులు..!గన్నవరంలో టీడీపీకి డేంజర్ బెల్స్..?శాండ్‌పేపర్‌గేట్ వివాదాన్ని మళ్లీ రాజేసిన ఉస్మాన్ ఖవాజా..!వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఆ నాయకుడే కారణమా..?వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్..?తెలుగులో బాలీవుడ్ సినిమాలకు 100 కోట్లు కలేనా..?డిసెంబర్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు..!హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేవంత్ మాస్ ప్లాన్..!

ఆ 24 లక్షలు ఎక్కడివి అవినాష్..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగాన్ని పెంచింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మొదటి రోజు విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సుమారు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో అధికారులు అవినాష్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో.. రేపు మరోసారి తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు అవినాష్ రెడ్డిని ఆదేశించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన కీలక వాంగ్మూలాన్ని ముందుంచి ఈడీ అధికారులు అవినాష్‌రెడ్డిని ప్రధానంగా ప్రశ్నించారు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా వివేకా హత్య కోసం చేతులు మారినట్లు చెప్తున్న రూ. 40 కోట్ల సుపారీ అంశంపై ఈడీ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దీనితో పాటు, గత ఆగస్టు 21న అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన కీలక పత్రాలు, బ్యాంక్ లాకర్ల వివరాలు, డిజిటల్ పరికరాల డేటా, స్వాధీనం చేసుకున్న రూ. 24 లక్షల నగదుకు సంబంధించిన మనీ ట్రెయిల్‌పై ఈడీ అధికారులు నిలదీసినట్లు సమాచారం.

Advertisement

ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను విచారించిన ఈడీ.. నేడు అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాధానాలను వారితో సరిపోల్చనుంది. ఈ క్రమంలోనే రేపు జరగబోయే రెండో రోజు విచారణ అత్యంత కీలకంగా మారనుంది. ఈ విచారణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, ఆధారాలు ధృవీకరించుకుని వచ్చే వారం నుంచి ఈ కేసులో కీలక అరెస్టులు చేసేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో గట్టిగా సాగుతుండటంతో పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement
Rajaneethi
రచయితRajaneethi

RajaNeethi న్యూస్ డెస్క్

రాజనీతిని ఫాలో అవ్వండి
రాజనీతి యాప్ఏపీ, తెలంగాణ రాజకీయాలు, జాతీయ వార్తలు, విశ్లేషణలు – అన్నీ ఒకే యాప్‌లో. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
షేర్ చేయండి:

సంబంధిత వార్తలు

మరిన్ని ›

మీ అభిప్రాయం తెలియజేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

WhatsApp షేర్