రోహిత్ శర్మతో నా బంధం ఇప్పటిది కాదు: గంభీర్ ఆసక్తికర కామెంట్స్..!

0
5

రోహిత్ శర్మతో నా బంధం ఇప్పటిది కాదు: గంభీర్ ఆసక్తికర కామెంట్స్..!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో తనకున్న అనుబంధంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2027కు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా, వెస్టిండీస్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ ముంగిట గంభీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. రోహిత్ శర్మ భవిష్యత్తు, జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పుడు కెప్టెన్సీ మారితే వచ్చే సమీకరణాలపై అడిగిన ప్రశ్నకు గంభీర్ ఆసక్తికర కామెంట్ చేసాడు.

రోహిత్ శర్మతో తనకున్న బంధం కేవలం ఒక కోచ్, కెప్టెన్ తరహాది మాత్రమే కాదని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. రోహిత్ శర్మ తొలిసారి భారత జట్టులోకి అడుగుపెట్టినప్పుడు తాను సీనియర్ ప్లేయర్‌గా ఉన్నానని, ఆ సమయం నుంచే తమ మధ్య బలమైన స్నేహం, పరిచయం ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. విదేశాల నుంచి వచ్చే వేరే కోచ్‌ల మాదిరిగా కాకుండా, తాను రోహిత్‌ను వ్యక్తిగతంగా, ఆటపరంగా ఎంతో కాలంగా దగ్గరగా చూశానని, అందువల్ల తమ మధ్య వ్యూహాల పరంగా చర్చలు జరపడం చాలా సులువవుతుందని వివరించాడు.

ఒక జట్టుగా ముందుకు వెళ్లేటప్పుడు కోచ్ ఆలోచనలు ఒకలా, కెప్టెన్ ఆలోచనలు మరోలా ఉండటం సహజమేనని, అయితే అంతిమంగా భారత క్రికెట్ జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యం అని గంభీర్ పేర్కొన్నారు. ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని చెబుతూనే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ల అనుభవం జట్టుకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చాడు. మారుతున్న సమీకరణాలతో సంబంధం లేకుండా భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించడమే తమ ఉమ్మడి లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.