రాయలసీమ సభలో రాజకీయాలు వద్దు..!

0
6

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభలో కార్యకర్తల హడావుడి, ఆవేశాన్ని గమనించిన పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. “మీ ఆవేశం నాకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇది రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన సభ.. కాబట్టి ఇక్కడ రాజకీయాలు వద్దు” అని పేర్కొన్నారు.

అదే సమయంలో శత్రువులను ఉద్దేశించి వ్యూహాత్మక హెచ్చరికలు జారీ చేస్తూ.. “యుద్ధం వచ్చినప్పుడే కదా మనం మాట్లాడాల్సింది.. అవతలివారు హద్దులు మీరినప్పుడే కదా మనం యుద్ధం చేసేది” అంటూ తనదైన శైలిలో పవర్‌ఫుల్ కామెంట్స్ చేశారు. ఆయన నోటి నుంచి ఈ మాటలు రాగానే ప్రొద్దుటూరు సభా ప్రాంగణం అభిమానుల కేరింతలు, నినాదాలతో దద్దరిల్లిపోయింది.

రాయలసీమ ప్రాంతాన్ని కరువు నేలగా కాకుండా సుసంపన్నమైన, అభివృద్ధి పథంలో దూసుకుపోయే ప్రాంతంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా సీమ జిల్లాల్లో తాగునీరు, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి పనులు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా జల సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచుతూ, రాయలసీమను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వేదికగా ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.