వైసీపీ నోళ్లు మూయించిన లేడీ ఐఎఫ్ఎస్.. ఎవరీ భరణి? స్పోర్ట్స్ కోటా రచ్చపై ఓపెన్ ఛాలెంజ్.!

0
4

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రతిపక్షాలు ట్రోలింగ్ మొదలుపెట్టినప్పుడు.. అందరిలా సైలెంట్‌గా ఉండకుండా, నేరుగా మీడియా ముందుకు వచ్చి రూల్ బుక్ చూపించిన పవర్ ఫుల్ లేడీ ఆఫీసర్ ఎస్. భరణి ఐఎఫ్ఎస్. అసలు ఎవరీ భరణి..? ఆమెకు అంత ధైర్యంగా మాట్లాడే దమ్ము ఎక్కడి నుండి వచ్చింది..? ఎస్. భరణి 2021 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిణి. గతంలో చిత్తూరు జిల్లా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పని చేసినప్పుడు.. స్మగ్లర్ల గుండెల్లో వణుకు పుట్టించారు.

అడవుల రక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణాపై ఆమె తీసుకున్న కఠినమైన నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆమె నిబద్ధతను గుర్తించిన కూటమి ప్రభుత్వం.. ఇటీవల ఆమెను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జోరందుకున్న వేళ.. భరణి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కరికీ మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చారు.

“ఉద్యోగాలు రాలేదని ఆరోపించే ముందు రూల్స్ చదవండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆన్‌లైన్‌లో ఒరిజినల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయకుండా, ఇప్పుడు మాకు మెడల్స్ ఉన్నాయంటే కుదరదు” అని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, చట్టబద్ధంగా తాము వంద శాతం కరెక్ట్‌గా ఉన్నామని.. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే ఉద్యోగాలకు ఎంపికైన వారికి మళ్లీ స్కిల్ టెస్ట్ పెట్టడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాజకీయ విమర్శలకు భయపడకుండా, నిజాయితీతో కూడిన దమ్ముంటే ఎలా మాట్లాడాలో భరణి ఐఎఫ్ఎస్ నిరూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.