ఏపీలో మోగిన పల్లెపోరు నగారా..!

0
7

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మరింత వేడెక్కింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం, నేడు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలకు సంబంధించి నవంబర్ 15 నుంచి రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించనుండగా, నవంబర్ 17న నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు.

నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఏదైనా కారణంతో రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే నవంబర్ 27న చేపట్టి, అదే రోజు లేదా మరుసటి రోజు ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న, మూడో విడత ఎన్నికలు డిసెంబర్ 2న జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.