ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, మారుస్తున్న మాటలను గమనిస్తే.. ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతలా మాట మారుస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నోటిఫికేషన్ రాకముందు ఒక మాట, నోటిఫికేషన్ వచ్చాక మరో మాట మాట్లాడుతూ ఆయన తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారు. కేవలం ఈ ఎన్నికలే కాదు.. 2014 నుండి రాష్ట్రానికి అత్యంత కీలకమైన రాజధాని విషయంలో కూడా ఆయన అనేక యూ-టర్న్‌లు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల క్రితం జగన్ తన పార్టీ ఇంచార్జ్ లతో మీటింగ్ పెట్టి ఒక స్పష్టమైన నిబంధన విధించారు. “రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు, ఒకవేళ కూటమి వాళ్లతో అడ్జస్ట్ అయ్యి ఏకగ్రీవం చేసుకుంటే ఆ ఇంచార్జ్ లని తక్షణమే మార్చేస్తా, ఎన్నిక జరిగి తీరాల్సిందే” అని గట్టిగా చెప్పారు. కానీ తీరా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనుకునే సమయానికి సడన్ గా రూట్ మార్చి, అసలు ఈ ఎన్నికలనే ఆపేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు.
కోర్టులో కూడా చట్టపరంగా ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో, ఇప్పుడు పార్టీ కేడర్ తో మాట్లాడుతూ.. “మనకు ఈ ఎన్నికల్లో గెలుపు ముఖ్యం కాదు, కేవలం క్యాడర్ ని కాపాడుకోవడం కోసమే పోటీ చేయాలి” అంటూ కొత్త సాకులు వెతుకుతున్నారు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని చూసి, తాము గెలవలేము అనే పక్కా సమాచారం ఉంది, కాబట్టే జగన్ ఇలా ముందస్తు డిఫెన్స్ డైలాగులు వాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోందనే విమర్శలు వస్తున్నాయి.
జగన్ మాట మార్చడం అనేది కేవలం ఈ స్థానిక ఎన్నికలకే పరిమితం కాలేదు. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుండి రాష్ట్ర రాజధాని విషయంలో ఆయన ఆడిన మైండ్ గేమ్ ఏపీ భవిష్యత్తును పదేళ్లు వెనక్కి నెట్టేసింది. 2014 నుండి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు.. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని నిర్మాణానికి తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, కనీసం 30 వేల ఎకరాల భూమి రాజధానికి ఉండాలని తానే స్వయంగా సభలో చెప్పారు. కానీ 2019 లో అధికారంలోకి రాగానే ఆ మాటకు పూర్తిగా కట్టుతప్పి, మూడు రాజధానుల ముక్కలాటను తెరపైకి తెచ్చారు.
అమరావతిని గ్రాఫిక్స్ అని, శ్మశానం అని అవమానిస్తూ.. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానని మాట మార్చారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనే కనీస బాధ్యత లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నారు. 2024 లో మూడు రాజదానులతో ఎన్నికలకు వెళ్ళిన జగన్.. 2029 ఎన్నికల కోసం మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ మొదలుపెట్టారు.
ఇక అది పక్కన పెడితే.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో.. జగన్ సర్కార్ చేసిన అరాచకం అందరికీ గుర్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసి గెలుస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. కానీ చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో స్థానిక ఎన్నికల్లో Delete Cacheఎప్పుడూ దౌర్జన్యాలు చేసి గెలిచిన దాఖలాలు లేవు. కానీ 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం నడిపించిన అరాచక పర్వాన్ని ఏపీ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక వ్యూహం ప్రకారం వ్యక్తిగతంగా బద్నాం చేసి, కులం ముద్ర వేసి, రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తెచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని చూశారు.
ప్రత్యర్థులకు నామినేషన్లు కూడా వేయనివ్వకుండా, పోలీసు వ్యవస్థను వాడుకుని బలవంతపు ఏకగ్రీవాలతో నాడు ఎన్నికలను ఏకపక్షంగా ముగించారు. ఆనాడు తాము చేసిన అరాచకాలను పక్కనబెట్టి, ఇప్పుడు తాము గెలవలేము అనే భయంతోనే కూటమి ప్రభుత్వంపై ముందే బురదజల్లడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం స్థిరత్వం మరియు విశ్వసనీయత. కానీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను ధ్వంసం చేసి, అధికారం కోల్పోగానే ఇరవాదంప్లే చేయడం జగన్ కి అలవాటుగా మారింది. స్థానిక ఎన్నికల్లో పరాజయం తప్పదని తెలిసి, రేపు పొద్దున కేంద్ర బలగాలను పంపలేదు లేదా చంద్రబాబు మోసం చేసి గెలిచాడు అని చెప్పడానికే ఇదంతా ముందస్తు ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.














