నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. ఏపీకి ఏం చెయ్యాలో చెప్పండి.. చంద్రబాబుకు అంబానీ రిక్వెస్ట్..!

0
7

భారతదేశ వ్యాపార, పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ సంస్థ ఏపీలో మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్కూల్ శంకుస్థాపనతో పాటు రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ 2024 జూన్ నుంచి ఏపీ ఫేట్ మారిపోయిందన్నారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఆంధ్రప్రదేశ్ మీద ఇన్వెస్టర్లకు నమ్మకం కుదిరిందని, పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయన్నారు. 2024 నుంచి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 388 పెద్ద ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని, తద్వారా 14 లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయని, 11 లక్షల కోట్ల ఉద్యోగాలొస్తున్నాయని అనంత్ అంబానీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతోందని, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోందన్నారు.

చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారమవుతుందన విశ్వాసం వ్యక్తం చేశారు. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థకి రిలయన్స్ సంస్థ అన్ని విధాలుగా సపోర్టు చేస్తుందన్నారు. తనని ఆంధ్రా బిడ్డగా స్వీకరించాలని కోరారు. ఏపీకి తాను ఏ విధంగా సపోర్ట్ చెయ్యాలో దిశానిర్దేశం చెయ్యండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రిక్వెస్ట్ చేశారు. అనంత్ అంబానీ ప్రసంగం, ఆంధ్రాపై ఆయన చూపించిన అభిమానం అందర్నీ ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.