డబ్బు, హోదా, సామ్రాజ్యం ఎంత ఉన్నా.. భారత సాంప్రదాయం, పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతలే మనిషిని మహోన్నతుడిగా నిలబెడతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మరోసారి నిరూపించారు. గాంధీ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రతిష్టాత్మక ‘రాయలసీమ హార్టికల్చర్ హబ్’, ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సభ వేదికపై అనంత్ అంబానీ ప్రదర్శించిన అత్యున్నత సంస్కారం, నిరాడంబరత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరి హృదయాలను గెలుచుకుంది.
ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వారసుడు, వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ, అనంత్ అంబానీ తన స్థాయిని ప్రక్కన పెట్టి భారత సంస్కృతిని చాటిచెప్పారు. సభ అనంతరం తిరిగి వెళ్ళే సమయంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కాళ్లకు మొక్కి, ఆశీర్వాదం తీసుకున్నారు. వయసులో పెద్దలకు సాధారణ బిడ్డలా మోకరిల్లి ఆశీస్సులు పొందిన ఈ అద్భుత దృశ్యం సభకు వచ్చిన వేలాది మందిని మైమరపించింది.
ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలే ఒక్కోసారి అహంకారంతో ప్రవర్తించే ఈ రోజుల్లో.. అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్త తనయుడు చూపిన ఈ వినయపూర్వకమైన ప్రవర్తన ఎవరూ ఊహించనిది, అత్యంత అభినందనీయం అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు పలువురు. కేవలం సంస్కారంతోనే కాకుండా, తన పవర్‌ఫుల్, ఎమోషనల్ మాటలతో అనంత్ అంబానీ రాయలసీమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌ను కొనియాడుతూ.. “నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ బిడ్డగానే భావించండి. ఈ అందమైన రాష్ట్ర అభివృద్ధికి నేను ఏ విధంగా ఉపయోగపడాలో, ఎలా సహకరించాలో మీరే నాకు దిశానిర్దేశం చేయండి” అంటూ చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.
ఏపీ రైతులను కేవలం అన్నదాతలుగానే కాకుండా ‘ఊర్జ దాతలు’గా మార్చడానికి, వ్యవసాయ రంగంలో జియో క్రిషి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరియు డిజిటల్ ఫార్మింగ్ తీసుకురావడానికి రిలయన్స్ సంస్థ పూర్తి అండగా నిలబడుతుందని ఆయన పవర్‌ఫుల్ అస్యూరెన్స్ ఇచ్చారు. డబ్బు ఎంత సంపాదించినా కరిగిపోతుందేమో కానీ.. అనంత్ అంబానీ మదనపల్లె వేదికపై చూపిన ఈ అద్భుతమైన సంస్కారం, పెద్దల పట్ల వినయం, మరియు ఆంధ్రా రైతులపై చూపిన మమకారం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన అనంత్ అంబానీ నిజంగా నేటి యువతరానికి ఒక గొప్ప ఆదర్శం అంటున్నారు పరిశీలకులు.














