28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిఫ్యాన్స్ కి కులధృవీకరణ పత్రం కావాలా ?

ఫ్యాన్స్ కి కులధృవీకరణ పత్రం కావాలా ?

ఎవడికి నచ్చిన హీరోకి వాడు కటౌట్ కట్టుకోవచ్చు. ఫ్లెక్సీ పెట్టుకోవచ్చు. అదంతా అభిమానం. అదే బాలక్రిష్ణ సినిమాకు ఈల కొట్టినా, ర్యాలీ తీసి జెండా పట్టినా వాడు మాత్రం కమ్మోడే ! ఈ ప్రిన్సిపుల్ రాజ్యాంగంలో రాసినట్టుగా కొందరు నడ్డిగాళ్లు హడావుడి చేయడం, పెడబొబ్బలు పెట్టడం చూస్తుంటే అఖండ ఇంత పెద్ద సక్సెస్ అనమాట అని తెలియని వాళ్లకి తెలుస్తోంది. పంపినోళ్లు బాగానే ఉన్నారు. వెళ్లినోళ్లు కలిసిపోయారు అక్కడ అందరితో. కానీ ఇక్కడ మిగిలిన కొందరు నడ్డిగాళ్లు మాత్రం డాలస్ లో కమ్మోళ్లు ర్యాలీ తీయడం వల్ల బాలక్రిష్ణకీ, టీడీపీకి జరిగే నష్టమే ఎక్కువ అంటున్నారు. లాభమో నష్టమో తర్వాత సంగతి, వాళ్లు అందరూ కమ్మోళ్లని ఎవడ్రా చెప్పింది ? అయినా టార్గెటెడ్ గా ఓ కులం గురించి మాట్లాడుతూ… కులరహిత నీతి సూత్రాలు ఎట్లా చెబుతార్రా బ్లడీఫూల్స్ !

బాలక్రిష్ణ సినిమాకు కొన్ని బారికేడ్లు ఉంటాయ్. సినిమా అనౌన్స్ చేయగానే, హీరోయిన్ ఎవరటా – దొరకట్లేదట హీరోయిన్. బాలయ్య సినిమాకి అదే ట్రబుల్ అని మొదలువుతుంది నెగెటివ్ వైబ్రేషన్. అంటే డైరెక్టర్ తో మాంఛి కాంబినేషన్ పడింది అని అర్థం. ఆ విషయం చర్చలో ఉండకూడదు కాబట్టి హీరోయిన్ దొరకట్లేదు అంటాం. నడ్డి మీడియా స్పెషాలిటీ అది. సినిమా మొదలయ్యాక, అబ్బో బడ్జెట్ దాటేసిందట, బాలక్రిష్ణకి అంత మార్కెట్ లేదు కదా అందుకే నిర్మాత కొర్రీలు పెట్టాడట అని కూస్తారు. అంటే ఏదో జరిగిపోతోంది అనుకోవాలి అని. లేదంటే అప్పటికే టీజర్ వచ్చి బజ్ పెరిగి ఉంటది – శీను గారూ మీ నాన్నగారు టైపులో ! ఇక తర్వాత బాలయ్య సెట్లో ఉన్నాడంటే అందరికీ ప్యాంట్లు తడిసిపోతున్నాయట – కొట్టేస్తున్నాడు లాంటి వార్తలు పుడతాయ్. అంతా అయ్యాక బాలక్రిష్ణ సినిమాకి కొనేవాళ్లు కరువు. అందుకే నిర్మాత దర్శకుడు ఏకమై విడుదల చేసుకుంటున్నారు పాపం అంటారు. అంతేగానీ – వాళ్ల సినిమా మీద కాన్ఫిడెన్స్ తో వాళ్లే రిలీజ్ చేస్తున్నారు. రైట్స్ అమ్ముదాం అనుకోవడం లేదు అని మాత్రం చెప్పరు. వాట్ ఎ పాజిటివిటీ.

ఇవన్నీ అలవోకగా దాటేసి, టిక్కెట్ వందకి మాత్రమే అమ్మాలి అని రూల్స్ పెట్టినా ధైర్యంగా దిగుతాడు. దిగి తుక్కు రేగ్గొడుతుంటాడు. అప్పుడు ఇక కులం కోణం బయటకు వస్తది. అసలు మొత్తం జనాభాలో కమ్మోళ్ల శాతం ఎంత ? అందులో సినిమాలు చూసేది ఎందరు ? బాలక్రిష్ణ సినిమాలు చూసేది ఇంకెందరు ? ఒక్క కమ్మలు చూస్తేనే అఖండ హౌస్ ఫుల్ అవుతోందా ? అందుకే ఆడుతున్నాయా బాలయ్య సినిమాలు ? అలాంటప్పుడు అఖండకి ఆ కులం మాత్రమే హడావుడి చేస్తోంది అని ఎలా రాస్తుంది నడ్డి మీడియా ? ఇక్కడే ఉంది అసలు పాయింట్. మన పడవ దేకలేనప్పుడు – ఎదుటి పడవ తగల బెట్టాలి అనేది ఓడిపోయేవాడి యుద్ధ ఎత్తుగడ. అంటే నేను దేకలేను కాబట్టి ఎదుటోడు ముందుకెళ్లకూడదు అనుకుంటారు. నెగెటివ్ మైండ్. అందుకే ఇక ఇన్ని ఫిల్టర్లు దాటి అఖండ అదరగొడుతుంటే – కులం అనే కోణం తీసి రాస్తున్నారు. దేంతో నవ్వాలో అర్థం కాదు ఇలాంటప్పుడే ! మాకు ఏ తేడాల్లేవుగా అయ్యా అని చిరంజీవి ఫ్యాన్స్ చీర్స్ చెబుతున్నారు. బాలయ్య అదుర్స్ అని అఖండకి థమ్స్ అప్ చెబుతున్నారు. మహేశ్ లాంటి వాళ్లు అయితే మరో అడుగు ముందుకు వేశారు. ట్వీట్ చేశారు, అయ్యబాబోయ్ ఇదేం ఎనర్జీ సార్ అంటూ సిగ్గుసిగ్గుగా నవ్వుతూ మహేశ్ అన్ స్టాపబుల్ కి వచ్చేశాడు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబాయ్ కళ్లల్లో గెలుపును గుర్తించాడు. సంతోషం.

ఇలాంటి సందర్భంలో కులం కోణం తీసి, పాత ఎత్తుగడనే కొత్తగా ఎందుకు వాడుతున్నాట్టు. ఎస్. కారణం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంలో కులం కీలకపాత్ర పోషించిన మాట వాస్తవం. ఒక్కణ్ని నెత్తిన పెట్టడం కోసం – ఓ కులాన్ని ఒంటరిని చేసింది పీకే ఎత్తుగడ. శబ్బాష్. రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఫలితం ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఆ ట్రాప్ లో పడినవాళ్లు అంతా. అందుకే కులం గిలం జాన్తానై అంటూ జనసేన లాంటి పార్టీలు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంలో గ్రౌండ్ లెవెల్లో కలిసి పనిచేస్తున్నాయ్. కానీ, ఇలాంటి వాస్తవాలు – జనం మైండ్ సెట్ నడ్డి మీడియాకు తెలియక కాదు. ఆల్రెడీ కాళ్లు ఒణుకుతున్నాయ్ కాబట్టే డాలస్ కులగోత్రాలు తీస్తున్నారు. లేకపోతే, మా కోడి పకోడి అయిపోతోంది అని ఒప్పుకోలేక ఓ మంద ప్లేచేస్తున్న ట్రిక్స్ ఇవి. కానీ తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. ఆప్టర్ ఆల్ బాలక్రిష్ణ సినిమా. పెద్దగా పబ్లిసిటీ చేయడు. ఇది కచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే అని ఎఫర్ట్ పెట్టడు. ఎవడు ఏమన్నా పట్టించుకోడు. నా పని నేను చేసుకుపోతున్నా అన్నట్టు ఉంటాడు బాలక్రిష్ణ. అందుకే ఆప్టర్ ఆల్ బాలక్రిష్ణ సినిమా అంటున్నది. అలాంటి సినిమాకే తండోపతండాలుగా జనం వచ్చి చప్పట్లు కొట్టి చూస్తున్నారూ అంటే అందులో ఏదో వాళ్లకి సొలేస్ దొరుకుతోంది. ఉపశమనం కల్గుతోంది అనమాటే. అదేంటో తెలియాలి అంటే – అఖండ ఆంధ్రదేశానికి ఏం చెప్పాడు అనే రాజనీతి ఐటమ్ చూడండి. తెలిసిపోద్ది.

ఇక మరో మాట. నిలువెల్లా విషం ఉన్న తాచుపాము కూడా, ఒకసారి కరిచిన తర్వాత గ్యాప్ తీసుకుంటది. వెంటనే కరిచినా ఫలితం ఉండదు. కోరల్లో విషం రీఛార్జ్ కావడానికి టైమ్ పడుతుంది. ఇది ప్రకృతి. ఏపీలో కూడా కుల ప్రభావం కూడా అంతే. కులం కాటు పడింది మొన్నే కదా. రెండున్నరేళ్లే అయ్యింది. 1989 ఎన్నికల తర్వాత కులం అంత ప్రబలంగా పని చేసిన ఎన్నిక 2019. మరి అప్పుడే మరో కాటు వేద్దామనుకుంటే ఎలా…? విషం రీఛార్జ్ కావడానికి కొంత టైమ్ పడుతుంది. వెయిట్ చేయాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments