స్థానిక ఎన్నికల విజయంపై బాబు-పవన్ కు స్టాండింగ్ ఒవేషణ్..!

0
7

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించడంపై రాష్ట్ర మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. నేడు అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయాలు నమోదు చేయడంతో, కేబినెట్ భేటీకి వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ “హిట్ కొట్టామంటూ” పరస్పరం కరచాలనం చేసుకుంటూ హాల్‌లోకి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ హాల్‌లోకి అడుగుపెట్టగానే మంత్రులందరూ లేచి నిలబడి వారికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక సమరంలో కూటమిని విజయతీరాలకు చేర్చినందుకు గానూ ‘చంద్రబాబు-పవన్ కళ్యాణ్’ ద్వయానికి మంత్రులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రులందరూ కొట్టిన అభినందనల చప్పట్లతో మంత్రివర్గ సమావేశ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల జోరును స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించి, క్షేత్రస్థాయిలో కూటమి బలాన్ని నిరూపించుకోవడంపై కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రివర్గం స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.