ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన, విలక్షణమైన తీర్పును ఇస్తూ వస్తోంది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే, ఇక్కడి పట్టణ ఓటర్లు అత్యంత చైతన్యవంతంగా వ్యవహరిస్తారు. 2014 నుండి తాజాగా నిన్న ముగిసిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వరకు పరిశీలిస్తే… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మూడు రాజధానులు’ అంటూ ప్రలోభాలు పెట్టినా, విశాఖనే ఏకైక రాజధానిగా మారుస్తానని హడావుడి చేసినా సరే, విశాఖ ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే బలంగా నిలబడ్డారనే విషయం స్పష్టమవుతోంది.
1. 2014 లో విజయమ్మ ఓటమి – నాడే స్పష్టమైన సంకేతం:
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం బలంగా ఉన్నప్పటికీ, వైఎస్ జగన్.. తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుండి బరిలోకి దిగారు. కానీ విశాఖ ప్రజలు ప్రాంతీయ సెంటిమెంట్లు లేదా వ్యక్తిగత ఇమేజ్‌లకు లొంగకుండా, నాటి టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి విజయమ్మను ఓడించారు. విశాఖ ఓటర్ల ఆలోచనా విధానం ఏంటో నాడే స్పష్టమైంది.
2. 2019 జగన్ వేవ్‌లోనూ కూటమి వైపే మొగ్గు:
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఒక భారీ సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ, ఆ వేవ్‌లో కూడా విశాఖపట్నం నగర పరిధిలోని 4 కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రజలు టీడీపీ అభ్యర్థులనే గెలిపించి అసెంబ్లీకి పంపారు. జగన్ వేవ్ కూడా విశాఖపట్నం అర్బన్ ఓటర్ల నమ్మకాన్ని కదిలించలేకపోయింది.
అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి ‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ అంటూ ఎంతగా ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు ఆ వ్యూహాన్ని నమ్మలేదు. అభివృద్ధి అంటే కేవలం రాజధాని బోర్డులు మార్చడం కాదు, మౌలిక వసతుల కల్పన మరియు ఐటీ, పారిశ్రామిక వృద్ధి అని నమ్మే విశాఖపట్నం ప్రజలు.. వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్, దౌర్జన్య పూరిత రాజకీయాలను తీవ్రంగా అసహ్యించుకున్నారు.
4. 2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక క్లీన్ స్వీప్:
రెండేళ్ళ క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా విశాఖ ఓటర్లు తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి బ్రహ్మరథం పట్టారు. విశాఖ లోక్‌సభ స్థానంతో పాటు, నగర పరిధిలోని, ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ స్థానాలను కూటమి అభ్యర్థులే రికార్డు స్థాయి మెజారిటీలతో కైవసం చేసుకున్నారు.
5. తాజా జీవీఎంసీ ఎన్నికల్లో రికార్డు విజయం:
నిన్న విడుదలైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఈ బంధాన్ని మరింత గట్టిగా నిరూపించాయి. మొత్తం 120 వార్డులకు గానూ ఎన్డీయే కూటమి ఏకంగా 98 వార్డులను.. టీడీపీ 64, జనసేన 26, బీజేపీ 8.. కైవసం చేసుకుని ల్యాండ్‌స్లైడ్ విక్టరీ సాధించింది. ముఖ్యంగా డైరెక్ట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన మేయర్ ఎన్నికలో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై దాదాపు 2.58 లక్షల ఓట్ల చారిత్రాత్మక మెజారిటీతో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు. వైసీపీ కేవలం 13 వార్డులకే పరిమితం కావడం విశేషం.
విశాఖపట్నం ఓటర్ల మైండ్ సెట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. వారు శాంతిభద్రతలను, పారదర్శకమైన అభివృద్ధిని, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారనేది ఈ తీర్పుతో స్పష్టమైంది అనే మాట వినపడుతోంది. చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖకు వచ్చిన ఐటీ హుద్‌హుద్ తుపాను సమయంలో ఆయన చూపిన నాయకత్వం ఇక్కడి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయి. జగన్ రాజధాని పేరుతో చేసిన రియల్ ఎస్టేట్ రాజకీయాలను, రుషికొండ విధ్వంసాన్ని విశాఖ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, అందుకే 2014 నుండి 2026 వరకు ప్రతి ఎన్నికలోనూ వారు టీడీపీని, కూటమిని గుండెల్లో పెట్టుకున్నారని ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం నిరూపిస్తోంది.














