30 C
Vijayawada
Sunday, August 30, 2026
Homeఆంధ్రప్రదేశ్ఇంటింటికీ తెలుగు తమ్ముళ్లు.. గ్రౌండ్ రిపోర్ట్ నాయకత్వానికి చేరుస్తారా?

ఇంటింటికీ తెలుగు తమ్ముళ్లు.. గ్రౌండ్ రిపోర్ట్ నాయకత్వానికి చేరుస్తారా?

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలు, సూపర్ సిక్స్ పథకాలు, చేస్తున్న అభివ్రుద్ధిని ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, క్లస్టర్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆషామాషీగా కాకుండా, ప్రతిరోజు పరిమిత సంఖ్యలో ఇళ్లకు వెళ్లి కూటమి విజయాలు వివరించడంతో పాటు, ఆ ఇంటి వాళ్లకు పాంప్లెట్ అందిస్తున్న ఫోటో తీసి యాప్ లో ఫోటోలు అప్ లోడ్ చెయ్యాల్సి వుంటుంది.

నిర్ణీత సంఖ్యలో అప్ లోడ్ చెయ్యకపోయినా, ఇళ్లకు వెళ్లకపోయినా వెంటనే హెడ్ ఆఫీసు నుంచి ఫోన్లు చేసి వివరణలు అడుగుతున్నారు. మేమేమైనా ఉద్యోగులమా అని కొన్ని చోట్ల కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 40 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం స్థానిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిన మేళ్లని వివరించడం, కార్యకర్తలను అలెర్ట్ చెయ్యడం. అయితే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.

పార్టీ ఏ రకంగా తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకుతెలియచెప్తుందో, అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా లోకల్ లీడర్ల ద్రుష్టికి ప్రజలు తీసుకొచ్చిన ప్రధానమైన సమస్యలను ప్రభుత్వం తెలుసుకుని వాటిని పరిష్కరించాలి. అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమైనట్టు, అప్పుడే ఈ ప్రభుత్వం మీద సానుకూలత పెరుగుతుంది. ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రధానంగా ప్రజలనుంచి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, హౌస్ మ్యాపింగ్ సమస్యలు, 22ఏ జాబితాలో వున్న భూములు, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వైసిపి వాళ్లకే పనులుకావడం వంటి ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పెన్షన్ల విషయం మనం గతంలో కూడా కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నాం. జగన్ హయాంలో తెలుగుదేశం సానుభూతిపరుల పెన్షన్లు కట్ చేశారు. తమ పార్టీకి చెందిన అనర్హులను కూడా పెన్షనర్ల జాబితాల్లో చేర్చారు.

శుభ్రంగా పొలంపనులు, ఇతరత్రా పనులు చేసుకునే వైసిపికార్యకర్తలకు కొంతమందికి వికలాంగుల పెన్షన్లు మంజూరు చేసి, అసలైన వికలాంగులకు అన్యాయం చేశారు. ఇప్పుడు వికలాంగుల పెన్షన్లు కూటమి ప్రభుత్వం పాక్షిక వైకల్యముంటే 6 వేలు, పూర్తి వైకల్యం వుంటే 10 వేలు ఇస్తోంది. అంటే ఏడాదికి లక్ష రూపాయలు పైనే. అలాగే వితంతు, వ్రుద్ధాప్య పెన్షన్లు 4 వేలకుపెంచారు. ఏడాదికి 48 వేలు. ఈ లబ్ధిదారులు ఎక్కువ మంది వైసిపి వాళ్లే. టిడిపి సానుభూతిపరులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. దీని మీదే తీవ్రమైన అసంత్రుప్తితో వున్నారు.

వైసిపి హయాంలో పేర్లు నమోదు చేయించుకున్న అనర్హులని జాబితాల నుంచి తొలగించాలన్న డిమాండ్ కూడా వుంది. ఇక రేషన్ కార్డుల కోసం అడిగేవాళ్లు కూడా ఎక్కువగానే వున్నారు. ఇళ్ల స్థలాల విషయానికొస్తే గతంలో జగన్ సెంటు భూములిచ్చాడు. సెంటు భూముల్లో ఇరుకు గదులతో ఇళ్ల నిర్మాణం చేశారు. కూటమి వచ్చాక గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలిస్తామని వాగ్దానం చేశారు. అయితే ఈ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. కొత్త ఇళ్లు శాంక్షన్స్ లేవు. దీని మీద కూడా ఫిర్యాదులందుతున్నాయి. హౌస్ మ్యాపింగ్ కు సంబంధించిన సమస్యలున్నాయి. మ్యాపింగ్ కోసం వెళ్లిన ఉద్యోగుల బాధ్యతారాహిత్యం వల్ల రెండు, మూడు పోర్షన్లుగా వున్న ఇంటిని ఒకే కుటుంబంగా పేర్కొనడం వల్ల ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కొంతమందికి అందడం లేదు.

పెన్షన్ల దగ్గర్నుంచి రేషన్ వరకు ఈ సమస్య వుంది. దీన్ని సరిచెయ్యాల్సిన అవసరం వుంది. 22ఏ సమస్యలు ఉన్నచోట ప్రజలు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ బాధ్యతారాహిత్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో వైసిపి వాళ్లకే పనులవుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, చిన్న చిన్న వర్క్స్ కూడా ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నట్టు చెప్తున్నారు.

గ్రామాల్లో మట్టి, గ్రావెల్ తోలకాల మీద ఏఎమ్మార్ కంపెనీ ఉద్యోగుల హడావుడి మీద కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం ఏ విధంగా అయితే మంచి పనులని, పథకాలని ప్రజలకు వివరిస్తుందో, అలాగే ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కూడా ఈ టీమ్ ల నుంచి సేకరించి, వాటి పరిష్కారానికి క్రుషి చేస్తే బాగుంటుంది. హెడ్ ఆఫీసు నుంచి ఈ కార్యక్రమం గురించి నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులని కూడా తెలుసుకోవాలి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments