టాస్క్ లేని చంద్రబాబు గురి పెట్టని తుపాకి లాంటోడు. తుపాకీనే… కాకపోతే గురి పెట్టుకుంటే ఏం లాభం ? అదే గురి పెడితే… గుండు దిగితే ఆ ఇంపాక్టు వేరే ఉంటుంది. చంద్రబాబు కూడా అంతే ! రెండున్నరేళ్లు విలవిల్లాడాడు. అన్యాయం జరుగుతోంది, జనం ఇబ్బందులు అంటూ ఏదేదో చెబుతున్నాడు అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు టాస్క్ దొరికేసింది. టార్గెట్ ఏంటో తెలిసిపోయింది. గురి కూడా కుదురుతోంది. అందుకే ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగేశాడు. ఇంతకీ ఏంటి టాస్క్ ? అసలు టార్గెట్ ఏంటి ?
ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆరాట పడేది ప్రతిపక్షం. అది రాజకీయం. అదే ప్రతిపక్షం అధికారంలోకి వస్తే బావుంటుంది అని జనానికి అనిపించడం మొదలు పెడితే అదీ అసలు రాజనీతి. అక్కడే ఉంది కిటుకు. నాకు ఫలానాది కావాలి అనుకోవడం ఆశ. ఎవరైనా పడొచ్చు అలాంటి ఆశ. దానికి మినహాయింపులూ, కొలతలూ ఏమీ లేవు. ఆశకు హద్దు లేదు అనే మాట అక్కడే వచ్చింది. అదే ఆశకి కాస్త కష్టం, ఆలోచన, పట్టుదల, పనితనం తోడై రంగంలోకి దిగితే ఆశయం అవుతుంది. ఆశకీ ఆశయానికి ఒక్క అక్షరమే తేడా ! కాకపోతే ప్రాక్టికాలిటీలో మాత్రం ఎన్ని కిలోమీటర్ల దూరమో దిగితే తప్ప తెలియదు. ఇప్పుడు అలాంటి ఆశయం కళ్ల ముందు కనిపిస్తోంది చంద్రబాబుకి. ఇక్కడ ఆశయం అంటే అధికారం కాదు. అందుకోవడం కాదు. ఆశయం అంటే పని చేయడం, సాధించడం, సత్తా చాటడం. అన్నిటికీ మించి… దారి తప్పిన సిస్టమ్ ను దారిలో పెట్టడం.
ఏం చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు ? ఏం చేస్తాడో, రాజకీయంగా ఎలాంటి అడుగు వేస్తాడో అనేది వేరే చర్చ. ఇక్కడ మాట్లాడుతున్నది ఆశయం గురించి. టాస్కు గురించి. ఏంటా టాస్కు అంటారా… తెలుసుకోవాలంటే చెప్పే వాళ్లు చాలా మంది ఉన్నారు. మొదటి వారంలో జీతం కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని అడగండి చెపుతాడు. ఫస్టు తారీఖున కాదు కదా కనీసం మొదటి వారం. అవును. పెన్షన్ ఎప్పుడు పడుతుందో తెలియక టెన్షన్ పడుతున్న పెన్షనర్లని అఢగండి చెప్పగలరు. మా బడి మాకు వదలండి… అమ్మేయకండి అంటూ రోడ్డెక్కిన విశాఖ విద్యార్థులు, తల్లిదండ్రుల్ని అడగండి. ఎస్. చెప్పేస్తారు. గూడు కట్టుకోడానికి లోడు తోలించుకున్న ఇసుకలో మట్టే మిగిలిందని భోరుమంటున్న మిడిల్ క్లాసును అడగండి వివరించగలరు. ఉక్క పోసేస్తోంది, దీనెమ్మ కరెంటు పోయింది అని తిట్టుకుంటున్న జనాన్ని కదిపితే తెలిసొస్తుంది, గతుకులో పడితే బతుకు ఏమవుతుందో తెలియని రోడ్ల మీద వెళుతున్న జనాన్ని అడిగితే అర్థం అవుతుంది. అన్నిటికీ మించి క్వార్టర్ కోసం రెట్టింపు డబ్బు పెట్టి పచ్చి లిక్కర్ తాగుతున్న మందుబాబును అడగండి… గుక్క తిప్పుకోకుండా చెబుతాడు చంద్రబాబు టాస్క్ ఏంటో !
అవును. అంతా సక్రమంగా నడిచిపోతున్నప్పుడు… సుఖంగా సాగిపోతున్నప్పుడు గుర్తు రాడు చంద్రబాబు. గాడి తప్పినప్పుడు… బోర్లా పడినప్పుడు… దిక్కు తోచనప్పుడు మాత్రమే కళ్ల ముందు మెదులుతాడు. ఎందుకంటే చంద్రబాబు డాక్టర్ లాంటోడు. నిజమే ! డాక్టర్ బాబు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు , ఉల్లాసం ఉరకలేస్తున్నప్పుడు ఆయనతో పని లేదు. జబ్బు పడినప్పుడు, రిపేరు అవసరం అయినప్పుడు, జీవితం ఏమైపోతుందో అని భయం పట్టుకున్నప్పుడు మాత్రమే డాక్టర్ కావాలి. ప్రిస్కిప్షన్ రాయాలి. ఇంజెక్షన్ చేయాలి. అలా ట్రీట్మెంట్ చేస్తాడు కాబట్టే చంద్రబాబు టాస్కు మాస్టర్. అలాంటి పరిస్థితి అనుకున్న దానికంటే ముందుగానే వచ్చింది కాబట్టే అంటున్నది టాస్క్ ఇచ్చేశాడు అని ! మరో మాట. బలం చూపించేవాడు బలవంతుడు. పని మాత్రమే చేతనైన వాడు, చేసి చూపించేవాడూ పనిమంతుడు. జనానికి పని అవసరం అయినప్పుడు, పని చేస్తేనే సర్వైవల్ అని వాళ్లు గుర్తించినప్పుడు ఆ బలవంతుడు… ఈ పనిమంతుడి చేతిలో ఓడిపోతాడు. దటీజ్ కాల్డ్… టాస్క్ ఎకంప్లీష్మెంట్.
Yes. Its true. He proved to be the ‘Specialist’ in hard times, disasters,calamities,whenever the system goes in wrong direction his presence is hardly needed. The people needs him right now.