33 C
Vijayawada
Friday, September 4, 2026
Homeఆంధ్రప్రదేశ్మళ్లీ రోడెక్కనున్న ‘జగన్’.. ఆ ముహూర్తం ఎందుకంత స్పెషల్..?

మళ్లీ రోడెక్కనున్న ‘జగన్’.. ఆ ముహూర్తం ఎందుకంత స్పెషల్..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మళ్లీ పాదయాత్రల సందడి షురూ కాబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో తిరిగి పునరుత్తేజపరిచేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక భారీ పొలిటికల్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ 2027 జూలై 8వ తేదీ నుండి ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్రను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగన్ తన తదుపరి మహా యాత్రకు 2027 జూలై 8ని ముహూర్తంగా ఎంచుకోవడం వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉంది.

ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. గతంలో కూడా వైఎస్సార్ జయంతి, వర్ధంతి వంటి ప్రత్యేక రోజుల్లోనే వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, వైఎస్సార్ జయంతి రోజే పాదయాత్రను ప్రారంభించి క్యాడర్‌లో కొత్త జోష్ నింపాలని జగన్ భావిస్తున్నారు. ఈ సరికొత్త పాదయాత్ర కేవలం కొన్ని రోజుల పాటు సాగేది కాదు. దాదాపు 18 నెలల పాటు, అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు నిరంతరాయంగా ప్రజల మధ్యే ఉండేలా వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ రూట్ మ్యాప్‌ను డిజైన్ చేస్తోంది.

రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని, ప్రతీ పల్లెను తాకుతూ సాగేలా ఈ యాత్ర ఉండబోతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, హామీల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. వైసీపీ అంతర్గత వ్యూహం ప్రకారం.. 2026 లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుగా ఫోకస్ పెట్టి క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేస్తారు. ఆ వెంటనే 2027 జూలై నుండి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సుదీర్ఘ యాత్ర సరిగ్గా 2029 ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల ముంగిట ముగిసేలా ప్లాన్ చేశారు. ఎన్నికల నాటికి ప్రజల్లో పూర్తి స్థాయి మైలేజ్ మరియు ప్రభుత్వంపై యాంటీ-ఇన్‌కంబెన్సీని క్యాష్ చేసుకోవడమే జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments