40 C
Vijayawada
Wednesday, April 24, 2024
Homeరాజ నీతివచ్చే ఎన్నికల్లో పవన్ ఇంత కీలకమా ?

వచ్చే ఎన్నికల్లో పవన్ ఇంత కీలకమా ?

తుపాకి తూటా చూడ్డానికి పెద్ద డేంజరస్ గా ఏం కనిపించదు. పెద్ద ప్రమాదం కూడా ఏం ఉండదు దానివల్ల. అదే గన్ లో లోడ్ చేస్తే ! ఎస్. కాంబినేషన్ అంటే అదే ! గోపాల, భీమ్లా అంటూ సినిమాల్లో మల్టీ స్టారర్లు చేసే పవన్… పొలిటిక్స్ లో కూడా ఆ కాంబినేషన్ ట్రై చేస్తే డెడ్లీ వెపన్ అయ్యే అవకాశాలు అమాంతం రెండుమూడింతలు పెరుగుతాయ్. ఇవతల పక్క తుపాకిలో గుళ్లు లేకా కాదు… అవతల పక్కన బుల్లెట్లకి చిన్నదో బుడ్డదో తుపాకీ దొరక్కా కాదు. కాకపోతే కాంబినేషన్ కుదిరితే మాత్రం మోసుకెళ్లేవాడికి దూసుకెళ్లేవాడికి తోడైనట్టు ఉంటుంది. జాతి వైరాలు, వెండితెర వార్ లు పక్కకునెట్టి వాస్తవాలు చూద్దాం ఓసారి !

పవన్ కల్యాణ్ లాంటి సినిమా స్టార్… ఓ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన పార్టీని మరో ఎన్నికల వరకూ కొనసాగించడమే పెద్ద సక్సెస్. నిలకడ అంటారు దాన్ని. ఈ విషయం చాలా మందికి అర్థంకాక పవన్ ను తేలిగ్గా లెక్కేస్తారు. తప్పది. అంత స్టార్ డమ్, డిమాండ్ ఉన్నోడు గడ్డంపెంచి జనంలో తిరుగుతూ, రాజకీయాల్లో కొనసాగుతున్నాడు, అదీ అంత పెద్ద ఎదురుదెబ్బ తర్వాత, అంటేనే కసి ఉన్నోడు అని అర్థం. ఆ విషయం జనం అర్థం చేసుకుంటారు. ఈ మాట ప్రతీ ఒక్కడికీ చెప్పరు. సందర్భం వచ్చినప్పుడు ఓటు రూపంలో బైటపడతది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. పవన్ కి కొన్ని ఏజ్ గ్రూపుల్లో ఫాలోయింగ్ ఎక్కువ. సపోజ్ బిలో 35. ఇదే గేమ్ చేంజర్. ఇప్పుడున్న ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చేసిందని, తిరగబడాలన్నంత కసి ఉందని అప్పొజిషన్ లెక్కలు వేస్తోంది. అన్ని ఏజ్ గ్రూపులూ వేరు. బిలో 35 వేరు. బరువు బాధ్యతల కన్నా ఎమోషన్ ను ఎక్కువగా ఫీలయ్యే బాపతు వీళ్లు. అంటే అప్పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రత్యర్థిని కొట్టాలంటే ఈ జోనర్ లో పట్టున్న పవన్ కుదిరితే కలిసొస్తది. ఇది రెండోది.

కోస్తా జిల్లాల్లో లెక్కలు తీయండి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ. గత ఎన్నికల్లో వైసీపీకి టీడీపీకి మధ్య ఓట్ల తేడా ఈక్వల్ టు జనసేన ఓట్లు. క్రిష్ణ, గుంటూరు జిల్లాల్లో టీడీపీ కన్నా వైసీపీకి ఏడు శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయ్. అక్కడ జనసేనకి పడిన ఓట్లు సరిగ్గా 7 పర్సంట్. ఉత్తరాంధ్రలో వైసీపీతో పోలిస్తే టీడీపీ ఐదు నుంచి ఆరు శాతం వెనకబడింది. అక్కడ పవన్ పార్టీ స్కోర్ ఐదుశాతంపైనే. నెల్లూరు లాంటి జిల్లాలో అయితే ఈ లెక్క మరీ ఆశ్చర్యం. టీడీపీ 12 పర్సెంట్ వెనకబడింది. జనసేన రాష్ట్రంలోనే అత్యధికంగా 13 శాతం ఓట్లు నెల్లూరులో స్కోర్ చేసింది. అంటే యాపిల్ లోగో చూశారూ, ముక్క కొరికేసినట్టు ఉంటుంది. ఆ యాపిల్ టీడీపీ అయితే… కొరికేసిన ముక్క జనసేన. రెండూ కలిస్తే పండు-తుంది. ఇది మూడోది. ఇక రాజకీయాల్లో కొనసాగి తీరాలన్న కమిట్మెంట్ కచ్చితంగా ఉంది పవన్ కి. కానీ కేడర్ ను నిర్మించాలనీ… ఉన్నవాళ్లను స్ట్రీమ్ లైన్ చేసి నియోజక వర్గాల వారీగా ఓ పథకం ప్రకారం వెళ్లాలనీ అనుకోడు. ఆ ప్రయత్నం చేయడు. ఎందుకంటే ప్రజారాజ్యం అనుభవం తనను భయపెట్టింది అని చెబుతాడు. మనం ఇంఛార్జుల్ని చేసి, లీడర్లను ఎలివేట్ చేస్తే వాళ్లు ఎదుటివాళ్లకి అమ్ముడుపోతారు. మన వల్ల గెలుస్తాం అని నమ్మకం ఉన్నవాళ్లని ఉండనివ్వండి. ఎన్నికలప్పుడు చూద్దాం అంటాడు. దగ్గరగా ఉన్నవాళ్లకి ఈ విషయం క్లియర్ గా తెలుసు. అంటే పార్టీ నిర్మాణం లేదు. ఇలాంటప్పుడు మోసుకెళ్లేవాళ్లు కావాలి. కంపల్సరీ. అంటే ఇదే మొదట్లో చెప్పిన లోడ్ చేసుకునే గన్. కాంబినేషన్. ఇదే నాల్గోది.

ఈ నాల్గు కారణాలూ చాలు. ఒకరి అవసరం ఒకరికి కచ్చితంగా ఉందీ అని చెప్పడానికి. టీడీపీలో చాలా మందికి ఈ విషయం మింగుడుపడదు. జనంలో ఇప్పటి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు పొత్త అవసరం ఏంటి అనడం రాజకీయంగా తెలివితక్కువతనం. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి పొత్తు ఉండితీరాలి. పైగా ప్రత్యర్థి పార్టీ జనసేన నుంచి లబ్ది పొందకుండా ఉండాలీ అంటే కలిసి తీరాలి. అంటే నీకు ఎంత అవసరం ఉందీ అనే దానికన్నా ఎదుటివాడి అవసరాన్ని అడ్డుకునేందుకైనా పక్కన పెట్టుకొని తీరాలి. ఇక పవన్ కోణంలో చూస్తే, సింగల్ గా పోటీ చేసి ఓ సారి కంగుతిన్నాక, ఈసారి పుంజుకోవాలీ అంటే పొత్తు ఉండి తీరాలి. ఆ క్లారిటీ ఆల్రెడీ ఉన్నా ప్రయత్నాలు మాత్రం మరో ఏడాది తర్వాత కానీ జరక్కపోవచ్చు.

ఈలోగా కొన్ని పవన్ మార్కు చమక్కులు విని – నవ రంధ్రాల్లో సీసం పోసినంత సమ్మగా ఉందని టీడీపీ ఎంజాయ్ చేయాల్సిందే ! తప్పదు. గంజాయి అనేది ఇప్పకిప్పుడు వచ్చింది కాదు. టీడీపీ హయాంలో ఉండగానే నాకు చెప్పారు అని మాట్లాడతాడు. ఉండే ఉంటే, అప్పుడు పిడికెడు ఉందేమో – ఇప్పుడు టన్నులు టన్నులుంది అలా ఎలా పోలుస్తావ్ అని పిసికేసుకుంటూ ఉంటారు టీడీపీ వాళ్లు. తప్పదంతే ! అసలు ఏడున్నరేళ్లుగా రాజధాని ఎందుకు లేదండీ మనకి అన్నాడు మొన్నోసారి. ఇది ఇంకా హైలైట్. అమరావతినే రాజధానిగా ఉంచాలి, ఉంచే వరకూ పోరాడుతాం అని ఇదే పవన్ అంటాడు కదా, అంటే రెండున్నరేళ్ల ముందు రాజధాని ఉన్నట్టే కదా. ఆ ఏడున్నరలోంచి ఈ రెండున్నర మినహాయించి ఎందుకు ఆలోచించడో అర్థం కాదు. ఇలాంటప్పుడు కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేయాల్సిందే ! తప్పదు. ఇన్ని డిజాస్టర్ల తర్వాత అత్తారింటికి దారేదీ లాంటి హిట్టు రాకపోతుందా అని ఎదురుచూడాలి. కాంబినేషన్ అంటే అదే మరి !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments