28 C
Vijayawada
Wednesday, September 11, 2024
Homeరాజ నీతినమ్మినోళ్లని ఆదుకోవడంలో చంద్రబాబు టాప్ ! ఆయన్ని తిట్టలేను అని తేల్చిచెప్పేసిన విపక్ష నాయకుడు

నమ్మినోళ్లని ఆదుకోవడంలో చంద్రబాబు టాప్ ! ఆయన్ని తిట్టలేను అని తేల్చిచెప్పేసిన విపక్ష నాయకుడు

నమ్మినోళ్లని ఆదుకోవడంలో చంద్రబాబు టాప్ !
ఆయన్ని తిట్టలేను అని తేల్చిచెప్పేసిన విపక్ష నాయకుడు

చంద్రబాబులో ఎమోషనల్ యాంగిల్ ఎలా ఉంటుందో బయటకు రాలేదు పెద్దగా ! కందుకూరు విషాదంలో బాబు స్పందించిన తీరు చూసో, లేదంటే బాధిత కుటుంబాలకు పార్టీ తరపున 23 లక్షల సాయం చేశాడనో మాత్రమే ఈ మాట అనడం లేదు.

ఆ మాటకొస్తే ప్రభుత్వాలు కూడా బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు రాని రోజులు ఇవి. అధికార నిర్లక్ష్యంతో విశాఖ లాంటి చోట్ల జరిగిన ప్రమాదాల్లో కూడా ప్రభుత్వం తరపున కండితుడుపు పరిహారం మినహా పెద్దగా సాయం చేసిన సందర్భం ఉండటం లేదు. అలాంటిది, ఓ పార్టీ తరపున భారీ సాయం అందించడం అంటే మాటలు కాదు.

+ ప్రాణాలకు విలువ కట్టలేం
+ విషాదాన్ని సాయంతో సమాధానపరచలేం
+ నిజమే కానీ, నేను ఉన్నాను – అండగా నిలబడతాను
అని చెప్పేందుకు సాయం ఓ సాధనం

ఆర్థిక సహాయం ఆ కుటుంబాల్ని నిలబెడుతుంది. బాధో ఆవేదనో, మనం కార్చే కన్నీటి బొట్టో ఆ పూటో – ఒకట్రెండు రోజులో మాత్రమే ఉంటాయ్. కానీ ఆ తర్వాత ఆ కుటుంబాల్ని నిలబెట్టేది ఈ ఆర్థిక సాయమే ! అందుకే ఇంతలా చెప్పడం.

ఆఖరికి ఢిల్లీలో ఉన్న ప్రధాని కూడా స్పందించి, తన వంతుగా బాధిత కుటుంబాలకు 2 లక్షలు సాయం చేయడం కనబడుతోంది కానీ ఇక్కడ పెత్తందారులు మాత్రం… పేలాలు ఏరుకొనే పనిలోనే ఉండటం అసలు విషాదం. ఆ సంగతి తర్వాత చూద్దాం.

సాయం విషయంలో టీడీపీదీ, చంద్రబాబుదీ ముందు నుంచి దీర్ఘకాలిక ధోరణే. ముందు చూపే. పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ – ఫ్యాక్షన్ ప్రత్యర్థులు ప్రాణాలు తీసిన సందర్భాల్లో కానీ చంద్రబాబు చలించి స్పందించే పద్ధతి కదిలిస్తుంది. ఆర్థికంగా కుటుంబాల్ని ఆదుకోవడమే కాదు – తర్వాతి తరాలను నిలబట్టేందుకు ఆలోచన చేసే తీరు కానీ కుటుంబ పెద్దను గుర్తు చేస్తుంది.

+ బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్టు తరపున అండదండలు
+ ఉన్నత పదవుల కోసం ఆర్థిక సాయం
+ తండ్రిని పోగొట్టున్న ఓ యువకుణ్ని చదివించి…
ఎమ్మెల్యేను కూడా చేసిన నాయకుడు చంద్రబాబు

మీరంతా నా అక్కచెమ్మలు – అంటూ మెత్తమెత్తని కబుర్లు చాలా మందే చెబుతారు. కానీ చేత్లలో చూపించేవాళ్లు, చేదోడుగా నిలిచే వాళ్లూ కొద్ది మందే ! కాదు కాదు చంద్రబాబు ఒక్కడే. పార్టీ కోసం నిలబడిన వాళ్లనే కాదు, పార్టీని నమ్మిన వాళ్లను కూడా ఆదుకున్న సందర్భాలు, చదువుకు సాయం చేసి గండి పేట స్కూళ్లలో అన్నీ తానై చదివించిన ఉదంతాలు చంద్రబాబులో మానవ కోణాన్ని చూపిస్తాయ్.

ఓ యువకుడు తండ్రిని కోల్పోతే నేను ఉన్నాను నీకు – అని చెప్పాడు చంద్రబాబు. చదివిస్తాడనో, ఉద్యోగం ఇప్పిస్తాడనో అనుకుంటే – నీకు లీడర్ అయ్యే లక్షణాలు ఉన్నాయ్, నువ్ ఎమ్మెల్యేగా ఉండు అని – తీర్చిదిద్దిన చరిత్ర చంద్రబాబుది. ఇది తంబళ్లపల్లికి తెలిసిన వాస్తవ గాథ.

ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ! బాధితులనే కాదు నమ్ముకున్న నాయకులను ఆదుకోవడంలో కూడా చంద్రబాబు గుప్త దాత. ఎడం చేతికి తెలియకుండా కుడిచేత్తో సాయం చేసే లీడర్. బిడ్డ పెళ్లికొచ్చె, నా తాన పైసల్లేవ్ – ఏం చేతనైతలేదు అని ఓ దళిత నాయకుడు బయటపడి చెబితే – ఠక్కున స్పందించి అక్కున చేర్చుకున్నాడు చంద్రబాబు. అమ్మాయి పెళ్లి ఘనంగా చేయాలి, నేను వంరగల్ వస్తా మీతో ఉంటా అంటూ డబ్బులిచ్చి పంపిన ఘట్టాలు ఎన్నో.

రాజకీయం తిరగబడి ఆ తర్వాత ఆ నాయకుడు పార్టీ మారినా – బాబు గారిని నేను విమర్శించలేను, ఆయన్ని అంటే మా ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోరు అంటూ సున్నితంగా తిరస్కరించడం ఆ తర్వాత కనబడిన వాస్తవం.

సాయం పొందినోళ్లు పార్టీ మారొచ్చు, పెంచి ఎమ్మెల్యేని చేస్తే పార్టీని దెబ్బతీసి జంప్ కొట్టొచ్చు గాక – చంద్రబాబు మాత్రం తనదైన పంథాలో ఆదుకుంటూనే ఉంటాడు. అభిమానం ప్రదర్శిస్తూనే ఉంటాడు. కన్నీళ్లకు వెల కట్టలేం కానీ మనం తల్చుకుంటే తుడవగలం అనేది సింపుల్ గా బాబు ఫిలాసఫీ !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments