38 C
Vijayawada
Thursday, April 25, 2024
Homeనీతి ప్రత్యేకంనో ఫిల్టర్ బాలయ్య - టాప్ 5 పంచ్ లు

నో ఫిల్టర్ బాలయ్య – టాప్ 5 పంచ్ లు

షూటింగ్ కోసం అంతా ప్లాన్ చేసుకున్నారు. తీరా ఆ సమయానికి పోలీసులు నో పర్మిషన్ అనేశారు. అక్కడ ఏం చేయాలో తెలియడం లేదు. అయినా సరే నేరుగా జనంలోకి పోయాడు. విష్ చేయాలని అనుకున్నాడు. తీరా వాళ్లు మీద పడి, కేరింతలు కొట్టి గోల చేసి – చొక్కా చించేశారు. ఉత్సాహం సునామీ అయిపోయింది. చుట్టూ ఉన్న వాళ్లు కంగారు పడుతుంటే తను మాత్రం స్టెప్పులు వేస్తూ చీర్ చేయడం మొదలు పెట్టాడు. ట్రూప్ బీట్ అందుకుంది. అలా పుట్టింది – ఆల్ ఐ వాంట్ టు సె ఈజ్ దట్, దె డోన్ట్ రియల్లీ కేర్ ఫర్ అజ్ పాట. మైఖేల్ జాక్సన్. సప్రెషన్ ను ఎదిరిస్తూ వచ్చిన ఈ పాట బిల్ బోర్డ్స్ రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఎం.జె ముందుగా అనుకున్నట్టు, అన్నీ ప్లాన్ ప్రకారం జరిగి నటించి ఉంటే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదేమో ! పర్ఫెక్షన్ అంటే ప్లానింగ్ కాదు. నేచురాలిటీ, ఒరిజినాలిటీ అని ప్రూవ్ చేసిన ఐకానిక్ క్షణం అది. ఎంటటైన్మెంట్ లో ఓ ట్రెండ్ గా నిలిచిన ఘట్టం.


ఇప్పటికీ హాలీవుడ్ హీరో రాక్ మొదలు తమిళ స్టార్ విజయ్ లాంటి వాళ్లు ఆ మూమెంట్ నే ఫాలో అవ్వడం చూస్తుంటాం. అలాగే తెలుగులో బాలయ్య బహుశా కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడేమో అనిపిస్తోంది. నటించడం కాదు. బి ఒరిజినల్. బి యువర్ సెల్ఫ్ – బి అన్ స్టాపబుల్ అని ప్రూవ్ చేశాడనిపిస్తోంది. బాలయ్య చేసి చూపించాడని కాకపోయినా జనంలో వచ్చిన రెస్పాన్స్ చూశాక అయినా మిగతా హీరోలు, ఇండస్ట్రీ మాట రియలైజ్ అవుతున్నారు. నోట్ దిస్ పాయింట్. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో స్టార్ట్ చేస్తున్నామని ప్రకటించే సమయంలోనే అల్లు అరవింద్ ఓ మాట చెప్పాడు. బాలయ్య తెర మీద తప్ప, జీవితంలో నటించడం తెలియని మనిషి అని. అరవింద్ చాలా మందిని దగ్గరగా చూశాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడేమో ! బాలయ్య నేచర్ ని ఒక్క మాటలో ఒడిసిపట్టుకున్నాడు అనిపించింది విన్నప్పుడు. అది అక్షరాలా నిజం అనిపిస్తోంది అన్ స్టాపబుల్ షో చూస్తున్నప్పుడు.


టీవీ షోల్లో మిమ్మల్ని అలరించిన ఆకట్టుకున్న సెలెబ్రిటీ షో ఏదీ అని ఆరా తీస్తే అందరూ అన్ డిస్ప్యూటెడ్ గా చెప్పిన మాట అన్ స్టాపబుల్ అని. పైగా, దేశం మొత్తం ఉర్రూతలూగిపోయే కపిల్ శర్మ షో కూడా బాలయ్య షో తర్వాత స్థానంలో ఉంది. ఐఎండీబీ ర్యాకింగ్స్ చెబుతున్న వాస్తవం ఇది. ఏ షో ఎక్కువగా చూస్తున్నారు, ఏ షో గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, ఏ షో గురించి రాస్తున్నారు, ఏ షో గురించి సోషల్ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది లాంటి పరామీటర్ల ఆధారాంగా తీస్తారు ఈ ర్యాంకింగ్స్. పైగా ఇది తెలుగు షో. అంటే మన భాష మాట్లాడేవాళ్లు గట్టిగా ఓ ఎనిమిది కోట్ల మంది ఉంటారేమో అంతే ! అయినా ఇంత ట్రెండ్ క్రియేట్ చేయడం, హిందీ షోలకు మించిన పాపులారిటీ రేటింగ్ తెచ్చుకోవడం వెనక ఓ సీక్రెట్ ఉంది. అంటే ఒరిజినాలిటీ, నేచురాలిటీ, నో ఫిల్టర్.


బాలయ్య ఎందుకంత స్పెషల్ ? బాలయ్య ఎందుకు ట్రెండింగ్ ? ఇంతకు ముందు అయితే ఎవరినైనా కొడితేనో, లేదంటే కొట్టాడని ప్రచారం చేస్తేనో ట్రెండ్ లో ఉండేవాడు. అసలు జరిగిందేమిటో ఎవరికీ తెలియదు. తను కూడా సంజాయిషీ ఇచ్చుకునే టైపు కాదు కాబట్టి ప్రచారం మిలిగిపోయేది. వాస్తవం మరుగున పడేది. ఇప్పుడు ఇండస్ట్రీలో, అభిమానుల్లో జనరేషన్ మారుతోంది. బాలయ్య తోటి హీరోలు మల్టీస్టారర్లు అంటూ జోనర్లు మారుస్తున్నారు. క్రమంగా వెనకబడటం కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో బాలయ్య షో చేస్తునాడు అనగానే అభిమానులకి తడబాటు గుర్తొచ్చింది. బాలయ్య తడబడతాడేమో అని. కానీ, ఇంత ఒరిజినాలిటీ ఉంటుందని, స్వచ్ఛత కనిపిస్తుందని, బాలయ్యలో మాటకారితనం తెలుగు అభిమానుల ముందు పరుచుకుంటుందని, సరికొత్తగా పరిచయం అవుతుందని ఊహించలేదు. ఇందులో స్ర్కిప్టెడ్ మూమెంట్స్ కన్నా స్పాంటేనిటీ ఎక్కువ ఉందని స్టార్లు చెప్పడం చూస్తే వాస్తవం తెలిసిపోద్ది. అందుకే బాలయ్య ఎక్రాస్ ద జనరేషన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ కి రికనెక్ట్ అయిపోయాడు. ఎంటైర్ తెలుగు ఎంటటైన్మెంట్ నే రి డిపైన్ చేసేశాడు. బి ఒరిజినల్ అని ట్రెండ్ సెట్ చేసేశాడు.


డైరెక్టర్ సుకుమార్ తో మాట్లాడుతున్నాడు బాలయ్య. ఏ ఊరు మీదీ అన్నాడు. సుక్కూ చెప్పగానే – ఓహో అదంతా చిరంజీవి బెల్ట్ కదా అనేశాడు ఠక్కున. మామూలుగా అయితే వంద లెక్కలు ఉంటాయ్. సామాజిక లెక్కలు, హీరోల బేస్ ల గురించి మాట్లాడరు టాలీవుడ్ లో. మేకప్ తో కప్పేస్తారు. బాలయ్య భోళాగా అనేసరికి సుకుమార్ కూడా అంతే జన్యున్ గా రియాక్ట్ అవ్వడం అందులో కనిపిస్తుంది. రవితేజ వచ్చినప్పుడు కూడా అంతే, నీకూ నాకూ ఏదో గడవ అయ్యిందంటగా – అని మొదలుపెట్టాడు. భద్ర సినిమా టైంలో జరిగిన ప్రచారం గురించి. మధ్యలో ఓ చోట, ఈ ఫోన్ పక్కనపడేసి ఓ సాయంత్రం ఏదైనా చెట్టుకింద మందుకొడదాం ఇద్దరం అనడంలో ఆనందం వినిపిస్తుంది. అభ్యంతరం కాదు. ఎన్టీఆర్ మీద అంత అభిమానమే ఉంటే అన్నగారి పార్టీని ఎందుకు వదిలిపోయావ్ అని మోహన్ బాబును అడగడంలో కానీ, నా మీద జోకుల్ని, ట్రోల్స్ నీ నేను పట్టించుకోను – వాళ్ల బతుకు వాళ్లది నా పని నాది అని నానీతో చెప్పడం కానీ నిజంగా నో ఫిల్టర్. నా లాంటోడితో యూరప్ లో రౌడీయిజం చేయించావ్ అని పూరీతో అంటున్నప్పుడు మేకప్ కనిపించదు. బాలయ్య కాళ్లు నేల మీద ఉన్నాయ్ అని అర్థం అవుతుంది.

ఓసారి చంద్రబాబు పల్లె నిద్ర ప్రోగ్రామ్ పెట్టాడు పార్టీ వాళ్లకి. బాలయ్య హిందూపూర్ లో ఉన్నాడు. అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీలు తెచ్చి పెట్టి, ఏర్పాట్లు, హంగామా నడుస్తోంది. సాయంత్రం అయ్యాక ఫ్రెష్ అయ్యి – అందరితో కలిసి భోజనం చేసి – డాబా మీదకెళ్లి – మడత మంచం తీసి వాల్చుకొని – బనీను లుంగీతో పడుకున్న బాలయ్యను చూసి ఊరు ఆశ్చర్యపోయింది. అభిమానులు సంబరపడ్డారు. బాలయ్య ఎక్కడైనా అలాగే ఉంటాడని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్. అన్ స్టాపబుల్ కూడా సరిగ్గా ఇంతే సహజంగా, ఆసువుగా చేశాడు. బాలయ్యలో కలివిడి, సహజమైన సరదాతనం కనిపిస్తాయ్ అందులో.

తను చేయాలనుకున్నట్టు చేస్తున్నాడు, మాట్లాడాలనుకున్నట్టు మాట్లాడుతున్నాడు కాబట్టే అంత ఎక్కిందేమో ! హీరోల కృతకమైన ఎమోషన్లు, ముఖాలకే కాదు మాటలకు కూడా వేసిన మేకప్పులు చూశాక – అలాంటి కవరింగులేమీ లేకుండా వచ్చిన బాలయ్యలో నేచురాలిటీ నచ్చుతోంది. ఇంత కాలం బాలయ్య మూసిన పుస్తకంలా ఉండేవాడు. కవర్ పేజీ మాత్రమే కనిపించేది. ఎవరికి తోచింది వాళ్లకి అర్థమయ్యేది. ఇప్పుడు తెరిచిన పుస్తకం అయిపోయాడు. ప్రతీ పేజీ కొత్తగా కనిపిస్తోంది. అవునా అనిపిస్తోంది. నిజమే. ఎంత సేపూ నటించాలంటే అలసిపోతాం, మనలా మనం ఉంటే మనం నచ్చేవాళ్లకి నచ్చుతాం అంటూ చెప్పే సింపుల్ ఫిలాసఫీ అందరికీ అర్థం అవుతోంది. ఎంటటైన్మెంట్ ని రీ డిఫైన్, రీ మోడల్ చేస్తోంది. నీ స్థానం మా మనసు అని చెప్పిస్తోంది. బాలయ్యను మరో పదేళ్లు స్టామినా స్టార్ గా అన్ స్టాపబుల్ గా నిలబెడుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments