28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిమాచర్ల మోడల్ ఏపీకి ఏం చెప్పింది ?

మాచర్ల మోడల్ ఏపీకి ఏం చెప్పింది ?

కుందేళ్లు కుక్కల్ని తరిమి కొట్టాయని ఓ పౌరుషాల కథ విజయ నగర సామ్రాజ్యాన్ని మనకి పరిచయం చేసింది చిన్నప్పుడు. నోట కరుచుకొని పోగలవు అని తెలిసినా ఎదురు నిలవడం కుందేళ్ల దమ్ము. పోరాడితే కుక్కలైనా తోకముడుస్తాయ్ అని ఇలా నిరూపించాలంటే సత్తా ఉండాలి. కాలం మారినా కుక్కలెప్పుడూ అలాంటివే ! కానీ కుందేళ్ల లాంటి జనమే విజయ నగర విజయ గాథల్ని తిరిగి రాసుకునేందుకు సిద్ధపడాలి అని పల్నాడు పోరు గడ్డ నిరూపిస్తోంది. ఏడాది తిరిగే లోపే బొమ్మ బొరుసై, దిమ్మ దిరిగి పోతుందని చాటుతోంది మాచర్ల. ఇదో మోడల్. నిరంతరం నలిగిపోవడం కాదు, నీలో నువ్వు రగిలిపోవడం కాదు ఒక్కసారి బయటకు వచ్చి చూడు – నీ సత్తా నీకే తెలుస్తుంది అని చాటుతున్న చిన్న సైజు సందేశం ఇది.


లీడర్లు ఎప్పుడూ బయటకు రారు. హౌస్ అరెస్టుల కోసం ఎదురు చూస్తారు. పట్టుమని ఓ పాతిక మంది కూడా జనంలో కనిపించడం లేదు. కేడర్ బలంగా ఉంది సార్. కసితో ఉన్నారు. కానీ లీడర్లే దొరకడం లేదు – ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలానే ఉంటుంది. ఇవన్నీ తెల్లారి లేస్తే, టీడీపీ సమర్థకుల మాటల్లో దొర్లే మాటలు. అవకాశం కళ్ల ముందు కనిపిస్తున్నా అడుగు బయట పెట్టలేని, చేవలేని, లేవలేని వాళ్లు ప్రతీ జిల్లాలోనూ అరజడనుకు పైగా ఉంటారు. అందులో మంత్రులుగా వెలగబెట్టిన వాళ్లూ ఉంటారు. వెనకెనక నక్కుతారు వీళ్లు. గుంటూరుకి ఆ సంగతి మహ బాగా తెలుసు. ఇక మిగతా సగం మందిలో కొందరికి క్లారిటీ ఉండదు. ఆఖరి నిమిషంలో ఏమవుతుందో అనే అనుమాన జీవులు వాళ్లు. ఇక మిగిలేది పావువంతు మంది. వాళ్లే కాస్తో కూస్తో కనిపిస్తున్నారు ఇప్పటి వరకూ. అలాంటిది ఇప్పటికిప్పుడు రీ యాక్టివేట్ అయిన ఓ నాయకుడి రాకతో పార్టీలో, జనంలో ఉత్సాహం ఎగసి పడటం ఇక్కడ అసలు పాయింట్.


ఇందులో అండర్ కరెంట్ చాలానే ఉంది. జనం ఫిక్స్. కానీ టీడీపీ నేతలే మ్యాచ్ ఫిక్స్. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉంటారు. మా జోలికి రాకండి మహప్రభో అనో, మనకెందుకులే, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందామని తోక కాళ్ల సందున సర్దుకొని ఊరుకోవడమో చేస్తారు. కొందరేమో చంద్రబాబు మోడల్లో – ఎదుటోడు కబడ్డీ ఆడుతుంటే ఛెస్ ఆడాలని ట్రై చేసి బోర్డు పగలగొట్టించుకుంటారు. కాలకేయులు కిలికి భాషలో కెలుకుతుంటే, తెలుగు దేశం మాత్రం తెలుగులో మాట్లాడి ఏం ప్రయోజనం ? అలాగని బూతులు తిట్టమనడం లేదు. రేపటి రోజున బూత్ లో ఏం జరుగుతుందో, జనం చేతుల్లో బూతుగాళ్ల భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చెబితే చాలు. ఆ పని చేసే వాటం, చేయగల ఒడుపు, చేయాలన్న కసి కొందరిలోనే ఉంటాయ్. జూలకంటి రాకతో సరిగ్గా అలాంటి ఉత్సాహమే మాచర్లకు కనిపించింది. కొత్త ఉత్సవం జరిగినట్టు అనిపించింది అందుకే ! అతని రాకే కాక రేపే స్థాయిలో ఉందీ అంటే జనం మైండ్ లో ఏముందో ఇట్టే అర్థంఅవుతోందిగా ! మాచర్లతో జూలకంటి ఫ్యామిలీకి దాదాపు 50 ఏళ్ల అనుబంధం ఉంది. రెండు విజయాలు ఉన్నాయ్ వారి పేరున.


1972లో జూలకంటి నాగిరెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచారు మాచర్లలో. తర్వాత, 1999లో జూలకంటి దుర్గాంబ టీడీపీ తరపున విజయం సాధించారు. అదే సమయంలో జూలకంటి కుటుంబానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి పెరిగింది. ఆఖరుకి స్థానిక కేసులు, కేడర్ ను కాపాడుకోవడం లాంటి విషయాల్లో కూడా పార్టీ సరిగా సహకరించలేదనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయ్. 2004, 2009లో బ్రహ్మానంద రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగినా, ఓసారి ప్రభుత్వ వ్యతిరేకత, ఇంకోసారి పీఆర్పీ ఓట్ల చీలిక ఎఫెక్ట్ చూపించాయ్. ఆ తర్వాత బ్రహ్మానంద రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014, 19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు మారారు. కేడర్ లో కాన్ఫిడెన్స్ పెద్దగా కనిపించలేదు. అప్పుడే ప్రత్యర్థి పట్టు గట్టిగా బిగిసింది. ఇలాంటి సమయంలో బ్రహ్మానంద రెడ్డి వస్తే బావుంటుందనే మాట రెండేళ్లుగా వినపడుతోంది. కొందరు మాట్లాడినా మొదట ఆయన ససేమిరా అన్నట్టు చెబుతారు. ఆఖరుకి, కొన్ని స్పష్టమైన హామీలు వచ్చాకే మళ్లీ రంగంలోకి దిగారు అని, యరపతినేని లాంటి నాయకులు మధ్యవర్తిత్వం చేశారని చెబుతారు. ఆ ప్రభావంతోనే ఇప్పుడు కేడర్ లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఊహించనంత మార్పు ఒక్కడి పునరాగమనంతో సాధ్యమైయ్యిందనే మాట పల్నాడులో వినిపిస్తోంది.

ఇక మాచర్ల మోడల్ ఏం చెప్పిందో చూద్దాం. ఎవరికి చెబుతుంది ఇంతకీ ? ఇంకెవరికీ టీడీపీకి, ఏపీకి ! సరైనోణ్ని ఎంచుకొని నిలబెడితే ఉత్సాహం ఈ స్థాయిలో ఉంటుంది. కేడర్ లో కాన్ఫిడెన్స్ నింపేవాడు, యుద్ధానికి సిద్ధం అంటూ బరిలో ధీమాగా దిగేవాడు ఎలా ఉంటాడో మాచర్ల చూస్తోంది. టీడీపీ అరుదుగా తీసుకునే సరైన నిర్ణయాల్లో ఇదొకటి అనిపిస్తోంది అందుకే. ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇంపాక్ట్ ఈ స్థాయిలో చూపించేవాళ్లు తక్కువేం కాదు. కాకపోతే ఎస్, యు కెన్ అని క్లియర్ కట్ గా చెప్పడం, అదీ రెండేళ్ల ముందు రంగంలోకి దిగేంత క్లారిటీ ఇవ్వడమే ఇక్కడ పాయింట్. ఇక ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ. స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే, ధైర్యంగా నిలబడితే అరాచకుడు ఎంతటి వాడైనా తోక ముడవాల్సిందే. మేం డిసైడ్ అయ్యాం అని పబ్లిక్ గా ప్రకటించేంతగా జనం అంతా ఏకమైతే ఎవ్వడేం ఈకలేడు. దట్స్ ఇట్. ఈ నిమిషానికి అరాచకానికి బ్రేక్ పడుతుంది. మరో రెండేళ్లకి మట్టికరుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments