41 C
Vijayawada
Wednesday, June 7, 2023
Homeరాజ నీతిబద్వేలులో పడిన నోటా ఓట్లు ఏపీకి ఏం చెప్పాయ్ ?

బద్వేలులో పడిన నోటా ఓట్లు ఏపీకి ఏం చెప్పాయ్ ?

ఎదురుగా మనిషి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు నిశ్శబ్దం వినిపిస్తుంది. అంటే మాట్లాడ్డానికి మాటల్లేకపోయి ఉండొచ్చు. లేదంటే మాట్లాడినా లాభం లేదు అనే అభిప్రాయానికైనా వచ్చి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితే పొలిటిక్సులోనూ ఉంటుంది. అవును. ఎన్నికల్లో నోట మాట రాని పరిస్థితి ఉన్నప్పుడే నోటా మాట్లాడుతుంది. గుర్రాన్ని నీళ్ల వరకూ తీసుకెళ్లొచ్చేమో, కానీ నీళ్లు తాగించలేం అంటారు చూశారా, ఇది కూడా అలాగే. ఓటర్లను బూత్ వరతూ తరలించొచ్చునేమో, కానీ వాళ్లతో ఓటు మాత్రం వేయించుకోవడం కొన్నిసార్లు తరం కాదు. అప్పుడే నోట మాట రాదు. నోటాకి ఓటు వస్తుంది.

బద్వేలులో 3600కుపైగా నోటా ఓట్లు వచ్చాయ్. అంటే బరిలో ఉన్న వాళల్లో ఎవరూ మాకొద్దూ అని చెప్పిన ఓట్లు ఇవి. నియోజక వర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షల 4 వేలు. లక్షా 47 వేలకుపైగా ఓట్లు మాత్రమే మొన్న ఉప ఎన్నికలో పోలయ్యాయి. పోరుమామిళ్ల లాంటి చోట్ల ఏడు ఎనిమిది వందల ఓట్లు మాత్రమే ఉన్న గ్రామాల్లో కూడా 1800కిపైగా ఓట్లు నమోదుకావడం, పోలవ్వడం వేరే కథ. కానీ నోటాకు అత్యధికంగా ఇన్ని ఓట్లు రావడం, అందులోనూ కడప జిల్లాలోని ఓ రిజర్వుడు నియోజక వర్గంలో ఇలాంటి పరిస్థితి ఉందీ అంటే మరో జిల్లా ఏదైనా అయితే ఈ లెక్క రెట్టింపు ఉండేదేమో. అలా ఉంటే కనుక అదే అసలు చర్చ అయ్యుండేది.
బద్వేలులో టీడీపీకి పెద్దగా బేస్ లేదు. ఇక్కడ మూడు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. అది కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీకి లోకి వచ్చిన వీరా రెడ్డి తెచ్చిన గెలుపే. ఆ తర్వాత పెద్దగా ప్రభావం లేనట్టుగా ఉంటుంది. కడపలో మాగ్జిమమ్ ప్రొద్దుటూరు లాంటి ఒకట్రెండు నియోజక వర్గాలు మాత్రమే ప్రభావవంతంగా ఉంటోంది టీడీపీ ఈ మధ్య. అలాంటి చోట్ల కూడా నోటా మాట్లాడ్డం అంటే జనం ఏదో చెప్పాలనుకుంటున్నట్టు లెక్క. మన రాష్ట్రమేమీ ఈజిప్టు కాదు కూడలిలోకి వచ్చి జనం తిరగబడటానికి. ఇదేం యూరప్ కాదు ప్రజా ప్రతినిధుల్ని కాలర్ పట్టుకొని ఆపడానికి. రష్యా అంత కన్నా కాదూ, కొట్టి నేరుగా డస్టు బిన్నుల్లో పడేయడానికి. కెనడా లాంటి చోట్ల అయితే పరిస్థితి ఇలా ఉందీ అని అర్థం అయితే ప్రజా ప్రతినిధి మంచులేని ఓ ఉదయం లేచి, మంచిగా సైకిల్ మీద జనంలో తిరిగేస్తాడు. కానీ మన దగ్గర అలా కాదు. జనం ఐదేళ్లు ఆగుతారు. చాలాసార్లు గుంభనంగా ఉంటారు. కొన్నిసార్లు పల్సు అంచనాలకు కూడా అందదు. గత రెండు ఎన్నికల్లో జరిగింది అదే. అలాంటిది ఇప్పుడు మాత్రం మైండ్ మేకప్ చేసుకున్నట్టు, ఆల్రెడీ రెడీ అయిపోయినట్టు, కేవలం రెండున్నరేళ్లలోనే సైలెంట్ గా ఓ సిగ్నల్ ఇచ్చింది బద్వేల్. మెజారిటీ పాయింట్ కాదు. ఇప్పటికిప్పుడు ఓడించలేకపోవచ్చు కానీ కొన్ని సార్లు ఈ నోటా ఓట్లు ఏదో చెప్పాలనుకుంటున్నట్టు లెక్క. అందుకే పని గట్టుకొని గుద్దుతారు జనం.

జనంలో బలంగా ఉండి, ఆర్థికంగా దన్ను ఉన్న ఓ గుంటూరు జిల్లా నాయకుడు మొన్న ఎన్నికల్లో ఓ మూడొందల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. టీడీపీ ఆయనది. అదే జిల్లాలో పెద్దగా గుడ్ విల్ లేని, బ్యాడ్ నేమ్ ఉండి – ఏమేమి చేత్తారు అని ఎదురు అడిగే నాయకుడు కూడా బంపర్ గా గెలిచాడు. వేవ్ అంటారు దాన్ని. అంటే అంత వేవ్ ఇచ్చారు అంటే జనం మోజుతో ఉన్నారు అని. అలాంటి మోజు తగ్గి, చల్లబడి, తిరగబడటానికి మామూలుగా అయితే కనీసం ఐదేళ్లు పైనే పడుతుంది. మనం ఇలా అనుకున్నాం కదా చూద్దాం, ఇంకొన్నాళ్లు చూద్దాం అని సర్దిచెప్పుకునే ధోరణి ఉంటుంది. అలాంటిది రెండున్నరేళ్లలో ఆలోచన మారే సంకేతం అంటే మరీ షార్టు నోటీస్. అదీ పోటీ లేని సొంత గడ్డ మీద. అదే అసలు పాయింట్.

ప్రత్యర్థిని చితక్కొట్టుకో. కానీ ప్రజల జోలికి రాకు అని చెబుతుంది మహా భారతం. అదే రాజకీయం అంటే. అలాంటిది వదిలేసి, ప్రత్యర్థిని ఓ చేత్తో కొడుతూనే మరో చేత్తో జనాన్ని కూడా ఓ పట్టు పడితే… పట్టు తప్పిపోతుంది. హోల్డు పోతుంది. మనకి రావాల్సిన అడ్వాంటేజ్… మరో చేతిలో నలిగిపోతున్న మన ప్రత్యర్థికి పోతుంది. బహుశా ఇలాంటి శాంపిల్ చూద్దామనే అనుకున్నాడో ఏమో చంద్రబాబు తెలివిగా దూరంగా ఉన్నాడు ఉప ఎన్నికకు. పల్సు తెలిసొచ్చింది. ప్రధాన ప్రత్యర్థి లేని ఎన్నిక కాబట్టి ఎదుటివాడికి సంతృప్తి లేకుండా పోయింది. అన్నిటికీ మించి ఆలోచించగల్గిన వాళ్లకి చాలా మేటర్ దొరికేసింది. నిజానికి, సరిదిద్దుకోడానికి ఇది సరైన సమయం. ఇంకా రెండున్నరేళ్లు ఉంది కాబట్టి ఆల్రెడీ తగిలిన దెబ్బలకి ఆయింట్ మెంట్ రాసుకుంటే బాగానే ఫలితం ఉంటుంది. దెబ్బలంటే జనానికి తగిలినవి, తగులుతున్నవీ.

ఎక్కడ కనపడితే అక్కడ స్థలాల్లో పాగా వేయడం ఆపి, జనం మనసుల్లో చోటు సంపాదించడం మొదలు పెడితే పెద్ద కష్టం ఏమీ కాదు తేరుకోవడం. అసలు అలాంటి అవసరం ఉందని గ్రహించారా లేదా అనేది అసలు పాయింట్. అధికారం అనేది బండిలో పెట్రోల్ లాంటిది. దాని మైలేజ్ వరకూ వస్తుందంతే. ముందు రిజర్వులో పడుతుంది. ఆ తర్వాత బండి ఆగిపోతుంది. నా చేతిలో ఎక్సలరేటర్ ఉంది కదా… నేను ఎక్కడికైనా వెళ్లగలను అనుకొని మట్టానికి పట్టుకుంటూనే, మొత్తానికీ ప్రోబ్లమ్. నీ బండికో కెపాసిటీ, దానికో మైలేజ్ లాంటి లిమిటేషన్లు ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి. అది మర్చిపోతే కనుక బండి నడిరోడ్డు మీద ఆగిపోతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments