33 C
Vijayawada
Tuesday, February 27, 2024
Homeరాజ నీతిచంద్రబాబూ... నిన్ను ఎలా ఓడించాలో చెప్పు !

చంద్రబాబూ… నిన్ను ఎలా ఓడించాలో చెప్పు !

ఓడినా గెలిచినా ఒకేలా ఉండేవాడిని బహుశా చంద్రబాబు నాయుడు అంటారేమో ! గెలిచినందుకు గీర ఉండదు. ఓడినందుకు నీరసమూ రాదు. నా పని నేను చేసుకుంటూ పోతా – అదొక్కటే నాకు తెలిసింది అని ఇప్పటి జనరేషన్ కి కనిపిస్తున్న చంద్రబాబులో ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఇక మా వల్ల కాదూ అని డిసైడ్ అయిపోయాం, నిన్న ఎలా ఓడించాలో మాకు తెలియడం లేదు. నీ వీక్ నెస్ ఏంటో, ఏం చేస్తే నువ్ ఓడిపోతామో మాకు నువ్వే చెప్పు అంటూ ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుడు చేతులెత్తి మొక్కిన ఘటన ఒక్క చంద్రబాబు జీవితంలోనే జరిగిందేమో ! ఎదురులేని మెజారిటీ వచ్చిందని విర్రవీగినోడు ఏడాది తిరగక ముందే పతనం వైపు పడిపోవడం చూసిన చోట, అసలు నిన్న ఎలా ఓడించాలీ అని ప్రత్యర్థులు మొత్తుకున్న సందర్భం రియల్లీ వెరీ వెరీ స్పెషలే కదా !

చంద్రబాబు ఊపు మీద ఉన్నాడు. నిరంతరం జనంలో ఉంటున్నాడు. వారానికోసారి నేరుగా ఫోన్లో మాట్లాడతాడు వాళ్లతో ! మరో మూడ్రోజులు ఠంచనుగా జిల్లాల టూర్లు, ఆకస్మిక తనిఖీలు అంటూ తిరుగుతాడు. రాష్ట్రమంతా ఓ వైబ్రేషన్ వచ్చేసింది. వీధిలైటు వెలగకపోయినా ముఖ్యమంత్రి అడుగుతాడేమో అని ప్రతీ ఒక్కడూ పర్టిక్యులర్ గా తమ పని తాము చేసుకుపోతున్న రోజులు. రాష్ట్రంలో బాబు. ఢిల్లీలో ఉన్న కేంద్రాన్ని నడిపిస్తున్నది కూడా బాబే. చంద్రబాబు ఢిల్లీలో దిగాడూ అంటే ప్రధాని తర్వాత అంతటి స్థాయిలో ఉన్న ఎల్ కే అద్వానీ ఎదురొచ్చి స్వాగతాలు చెప్పే రోజులు. ఇంతలోనే ఉప ఎన్నికలు వచ్చాయ్. టీడీపీకి ఎదురు లేదు. అంతలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయ్ అందులోనూ సేమ్ రిజల్ట్. అనుకోకుండా కేంద్రంలో ఎన్నికలు వచ్చాయ్. టీడీపీ డామినేషన్. అటు తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా చంద్రబాబే తిరిగి వచ్చాడు. అంతే లొట్టబోయిన సొట్ట బిందెలా అయిపోయింది ప్రత్యర్థుల పరిస్థితి.

ఓ రోజు చల్లగా కబురు వచ్చింది గాంధీ భవన్ నుంచి. పీసీసీ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ ఉందని. మామూలుగానే ముఖ్యమంత్రి మీద ఏదేదో విమర్శలు చేస్తారనో, ఇంకేదో మాట్లాడతారనో కదా అనుకుంటాం. పైగా అప్పటికి ఎనిమిది రాష్ట్రాల్లోనో ఏమో కాంగ్రెస్ అధికారంలో ఉంది దేశవ్యాప్తంగా. ఇలాంటి టైమ్ లో ప్రెస్ మీట్ పెట్టి, నాటి పీసీసీ చీఫ్ ఎంఎస్ఆర్ – అందరికీ షాక్ ఇచ్చే కామెంట్ చేశాడు. అయ్యా చంద్రబాబూ – ఇక నేరుగా చెప్పేస్తున్నా, మా వల్ల కావడం లేదు. ఏం చేస్తే నువ్ ఓడిపోతావో మాకు నువ్వే చెప్పు. ఇప్పట్లో నిన్ను ఓడించే పరిస్థితి లేదని మాకు అర్థం అవుతోంది – అంటూ మాట్లాడేసరికి పేపర్లలో పొద్దున్నే అదే హెడ్ లైన్. అప్పట్లో వారానికోసారి వచ్చే వీక్లీలు ఉండేవి. వాటిలోనూ అవే కవర్ స్టోరీలు. మోత అంటే మోత, మోతెక్కిపోయింది రాజకీయం అంతా !

అంతటి బలం మీదున్న బాబు… క్రమంగా వీక్ కావడానికి కారణం సేమ్. మొన్న 2019లో ఓడిపోవడానికి కారణం ఏంటో – సరిగ్గా 2004లో ఓడటానికి కూడా కారణం అదే. అజెండా ఏంటో తెలుసుకోకపోవడం, తెలుసుకున్నా దిద్దుకోక పోవడం చంద్రబాబుకి పెద్ద మైనస్. నేను రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తా అంటున్నా, విజన్ 2020 ఇచ్చింది వీళ్ల కోసమే కదా అనుకున్నాడు. అవతల వాళ్లు ఇంకో పక్క నుంచి నరుక్కొచ్చాడు. గ్రామీణం నిర్లక్ష్యానికి గురైపోయింది అని చెప్పి ఒప్పించారు జనంతో ! రాజకీయాల్లో కావాల్సింది వాస్తవాలు కాదు. అబద్ధాలూ నిజాలూ అసలు అవసరమే లేదు. చెప్పింది జనానికి మైండ్ లోకి దూరిందా లేదా, నమ్మించామా లేదా అనేదే పాయింటు. చంద్రబాబు ఇదే మిస్ అవుతాడు. మనం చెప్పిన పాయింటు పర్ఫెక్ట్ గానే ఉంది కదా అని చూసుకుంటాడు. మరో ఎండ్ మిస్ అవుతాడు. అవతల వాళ్లు నమ్మించారు. ఓడాడు.

నిజానికి 99 తర్వాత గ్రామీణ ఏపీలో చాలా మార్పులొచ్చాయ్. కేంద్రం సాయంతో ప్రతీ ఊరుకూ పక్కా రోడ్డు పడింది ఆ రోజుల్లోనే. ఓవర్ హెడ్ ట్యాంకులొచ్చి, ఐదేళ్లలోనే నీటి కనెక్టివిటీ అమాంతం 45 శాతానికి పైగా పెరిగిన రాష్ట్రంగా ఏపీ అవార్డులు కూడా అందుకుంది. కరువు వచ్చినా ధరలు పెరగలా ! వ్యవసాయ పనుల్లేకపోతే మౌలిక సదుపాయాల్లో గ్రామీణ కూలీలకి ప్రత్యేకమైన మెకానిజం కూడా ఏర్పడింది. ఇవన్నీ పని చేయవు. ఎందుకంటే ఒప్పించడం, నమ్మించడం అనే పాయింట్లే మూలసూత్రాలు రాజకీయ గెలుపు ఓటములకు. 2019లో కూడా జరిగింది ఇదే. నేను పోలవరం కడుతున్నా, రాజధాని కడతా, పెట్టుబడులు తెస్తా అన్నాడు. విడిపోయి పడిపోయిన రాష్ట్రం కాబట్టి నిలబడటం ముఖ్యం అనేది చంద్రబాబు ఐడియా కావొచ్చు. కానీ రాష్ట్రం సంగతి సరే, నాకేమిస్తావ్ అని జనం అడుగుతున్నారు అని వినిపించుకోలేకపోయాడు. చివర్లో తెలిసినా తిప్పికొట్టే టైమ్ లేకపోయింది. నాకేమిస్తావ్ అని ఎదురెళ్లి కౌగిలించుకున్నోడు నేల నాకించేసే రోజులు చూస్తోంది ఏపీ. ఇలాంటప్పుడు బాబు బలాలూ బలహీనతలూ మాట్లాడుకోవడం కేవలం కాలక్షేపం కాదు. సర్దుకొని ఎవడైనా పోతాడు. కానీ తప్పులు దిద్దుకొని ముందుకు పోయినోడే ఛాంపియన్ అవుతాడు. అందుకే ఇదంతా !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments