28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిచంద్రబాబు నిజంగానే పెగాసస్ కొన్నాడా ?

చంద్రబాబు నిజంగానే పెగాసస్ కొన్నాడా ?

ఇంట్లో దొంగ సామాన్లు కొట్టేసిపోతున్నాడు. నువ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావ్ వాణ్ని. అప్పుడు ఏం చేస్తావో చూపించు అని అడుగుతారు ఎస్సై ట్రైనింగ్ లో ! ఒకడు తెలివిగా లేచి, అండర్ సో అండ్ సో సెక్షన్ ప్రకారం దొంగతనం నేరం, నిన్ను అరెస్టు చేసి ఆరునెలలు జైలు శిక్ష వేస్తారు అని చెప్తాడు. పైగా మెచ్చుకోలుగా ఆ ఇన్ స్ట్రక్టర్ వైపు తిరిగి ఎలా చెప్పా అన్నట్టుగా లుక్ ఇస్తాడు. అది చూసి, ఆ నువ్ ఈ సోదంతా చెప్పేవరకూ వాడు ఉంటాడేంటి – ఎప్పుడో దొబ్బేసుంటాడు అంటాడు ఇన్ స్ట్రక్టర్. అదే నువ్వైతే ఏం చేస్తావయ్యా అని హీరోనిని అడగ్గానే, ఎరా ఎవడనుకుంటున్నావ్ రా… నా ఇంట్లో దొంగతనం చేస్తావా అంటుూ ఫడేల్ ఫడేల్ అని నాలుగు పీకుతాడు. ఇదే కరెక్టు ఇదే కరెక్టు అని ఇన్ స్ట్రక్టర్ అప్లాజ్ ఇచ్చేస్తాడు. దెబ్బకి దేవుడు దిగొస్తాడు అంటే ఇదే ! వైసీపీ గేమ్ ప్లాన్ ను ఛేజ్ చేసే విషయంలో, ఛేదించేటప్పుడూ టీడీపీలో ఆ హీరోని చూడాలనుకుంటారు ఫ్యాన్స్. కానీ ప్రతీసారీ ఆ మొదటి గుడ్ బోయ్ బయటకి వస్తాడు. అదే పెగాసస్ కన్నా అతి పెద్ది ప్రొబ్లమ్.

 

బురదలో పొర్లాడుతున్నవాడు… తెల్ల చొక్కా వేసుకున్నోడిని ఆడుకుంటాడు. నీ చొక్కా మీద మరక ఉంది చూడు అని డిఫెన్సులో పడేస్తాడు. అది మరక కాదురా, బ్రాండ్ స్టిక్కర్ అని నిరూపించుకోడానికి వీడు తంటాలు పడతాడు. ఈలోగా వాడి బురద చర్చకి రాదు. వాడు చేయాలనుకున్న రచ్చ చేసేస్తాడు. వీడు మిస్టర్ క్లీన్ అయినా సరే ఎంజాయ్ చేయాల్సిన టైమ్ ని డిఫెండ్ చేసుకోవడంలో పోగొట్టుకుంటాడు. టీడీపీ ఉత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. పింక్ డైమండ్ సంగతి ఏమైంది ? డీఎస్పీల బదిలీ ఆరోపణలు ఏమయ్యాయ్ ? పెగాసస్ అంటున్నారు సిగ్గులేదూ అంటూ మీడియాతో మాట్లాడ్డమే తీసుకోండి. లేదంటే, రీసెర్చ్ సెంటర్ లో శోధించి, పరిశోధించి మేం తప్పు చేయలేదు, చేయబోం అని నిరూపించుకునే సరికి నీరసం వచ్చేస్తది. పాపం అనిపిస్తది ఇలాంటి పాట్లు చూస్తే !

బాస్, ఎదుటివాడితో ఆడుకోవడం చంద్రబాబుకి చేతగాని విద్య. పైగా పావలా పని చేయ్ బాబూ అని పగ్గాలిస్తే రూపాయి పావలా చేయాలని ప్లాన్ వేసుకొని చతికిలపడటం ఆయన చరిత్ర. ఎదుటోడు బురద జల్లుతుంటే సర్ప్ పెట్టి ఉతుక్కుందాం అనుకుంటాడు తప్పితే మనం తిప్పికొడతాం అనుకోడు. కొట్టలేదు. అందుకే ఓడతాడు. బాబు పడటం వల్ల మనం ఓడాం అని జనం రియలైజ్ అయినప్పుడు మళ్లీ టీడీపీ గెలుస్తుంది తప్ప – చంద్రబాబు ఎదుటోణ్ని కొట్టేయడం వల్లో, పడగొట్టేయడం వల్లనో కానే కాదు. ఇదే వాస్తవం. గెలవడం సంగతి కాస్త అటుంచితే అసలు ఏది ఎందుకు జరుగుతోందో చెప్పేందుకు ఓ మాడ్యూల్ నీ, ఐడియాలజీనీ, వాస్తవాల్ని విడమరచి చెప్పేందుకు ఓ మోడల్ నీ టీడీపీ ఇప్పటికైనా కాయిన్ చేసుకోవాలి. లేకపోతే పెగాసస్ లాంటి ఉచ్చులు వస్తూనే ఉంటాయ్. ఉచ్చపోయిస్తామంటూ సవాల్ చేస్తూనే ఉంటాయ్.

 

పింక్ డైమండ్ పుకారు ఎందుకు పుట్టింది ? కళ్లులేని హిందు కబోదుల్ని ప్రభువు బిడ్డకు పాదదాసుల్ని చేయడానికి కాదూ ! మూఢ భక్తులు ముంచిన రాష్ట్రంగా ఏపీ మిగలడం కోసం పుట్టిన ముసలం అది. ఇదే విషయం అర్థం అయ్యేలా చెప్పాలి. ఆరోపిస్తేనో అరిస్తేనో సరిపోదు. ఆధార్ కార్డులు అఢ్డగోలుగా వాడుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ సర్వర్లు హైద్రాబాద్ లో ఉన్నాయ్ అంటూ ఎన్నికల ముందు కలకలం రేపింది ఎందుకు ? చంద్రబాబు బృందం సర్వేలు చేస్తే జనం సమాధానాలు చెప్పకూడదు. ప్రశ్న అడిగితే భయపడే పరిస్థితి రావాలి. ఏదో అయిపోతోంది, రాష్ట్రం దారి తప్పిపోతోందనే భ్రమ కలగాలి అని. కలిగింది. సక్సెస్ వాళ్లు ! అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్. ఆ పుకార్లని పుట్టించినోళ్లే మర్చిపోయారు ఇప్పుడు. ఇక జనానికి ఎక్కడ గుర్తుంటాయ్ ? ఇప్పుడు టీడీపీ అలాంటివి తల్చకొని కుమిలిపోవడం మాని ఎదురు తిప్పికొట్టడం ఎలాగో నేర్చుకోవాలి.

దేశాన్ని ఏలుతున్న పార్టీ – ప్రత్యర్థులకు పాతరేసేందుకు కొన్న సాఫ్టువేర్ అది. ప్రపంచం మొత్తానికి తెలుసు. తాను గెలిచినప్పుడు పిలిచినా పలకలేదనే కోపంతో బెంగాలామె ఏదో అంటుంది. అదంతా ఆమె ఫ్రస్ట్రేషన్. ఆమెకి పోటీగా మళ్లీ ఈ బాబెక్కడొస్తాడో అనే బెంగ కూడా ఉందేమో తెల్వదు. అలాంటప్పుడు ఈ ఆరోపణలు, ప్రచారాలూ ఊకలో ఈక అనుకోవాలి. ఊదేయాలి. ఊదరగొట్టకూడదు. పీకే ప్లానేశాడు. వీడు వాడేశాడు – లాంటి కబుర్లులన్నీ సొల్లు. అయినా ఓసారి పీకిన చోట ఆ పీకే రెండోసారి పీకేదేం లేదు. కావాలంటే రీసెంట్ హిస్టరీ చూడండి. ఎందుకంటే అబద్ధాలు పోగేసి, రాజకీయాన్ని సంకనాకించేశాక ఇక రెండోసారి పీకేని ఏకుతారు తప్ప పీకనివ్వరు ఏమీ ! అందుకే కొత్త క్లైంట్లను వెతుక్కుంటాడు ప్రతీసారీ. ఇలాంటి లాజిక్కులు వదిలేసి, సంజాయిషీలు చెప్పుకోవడం టైమ్ వేస్ట్.

తమ్ముడూ… ఒక్కటి మాత్రం నిజం. పాత ఆయుధాలతో కొత్త యుద్ధాలు చేయలేం. పాతరాతి యుగం నాటి ఆయుధాలతో అసలే గెలవలేం. ఆ సంగతి తెలుసుకోవాలి. యుద్ధం జరిగేది ఆయుధాలతో అయినప్పుడు… ఎదుటివాడు జియో గైడెడ్ మిస్సైళ్లు లాంటి వెపన్స్ తో వస్తున్నప్పుడు కత్తి యుద్ధం చేయాలనుకోవడం అమాయకత్వం. సాలెగూడు లాంటి ఎదుటివాడి విషపూరిత వెబ్ ను ఛేధించేందుకు టీడీపీ మేథోపరమైన మెకానిజం డెవలప్ చేసుకోవాలి. లేదంటే మొట్టమొదట పేరాలో చెప్పినట్టు వెంకీ సీన్ రిపీట్ అవుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments