36 C
Vijayawada
Saturday, April 20, 2024
Homeరాజ నీతిచంద్రబాబుతో అమిత్ షాకు ఇంత అవసరం ఉంటుందా ?

చంద్రబాబుతో అమిత్ షాకు ఇంత అవసరం ఉంటుందా ?

రాజకీయాలు ఎప్పుడూ స్టాటిక్ గా ఉండవ్. డైనమిక్ గా ఉంటాయ్. కొన్ని చోట్ల ఏటవాలుగా కొన్ని చోట్ల బల్లపరుపుగా ఇంకొన్ని చోట్ల మలుపు తిరిగి నీరు ప్రవహించినట్టుగానే పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయాలు కూడా మారతాయ్. ఇంతకీ అమిత్ షాకు చంద్రబాబు అవసరం పడటం ఏంటి ? షా తిరుపతికి వస్తున్న సమయంలో ఇలాంటి చర్చ ఎందుకు వస్తోంది ? రాబోయే రెండేళ్లలో రాష్ట్ర రాజకీయం ఢిల్లీలో ఎలా మారే అవకాశం ఉందో ఓ సారి చూద్దాం ! అప్పుడు అర్థమైపోతుంది ఏ టు జెడ్.

ఇదే తిరుపతి. చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. అమిత్ షా రాక. రాజకీయ కాక. రాళ్లు కూడా వేసింది రాజకీయం. అలాంటివన్నీ మర్చిపోతారా ? నల్ల జెండాలు రల్చిన చిచ్చు చల్లారిందా ? అయినా ఇప్పటి ఏపీ ప్రభుత్వానికి కాపలా కాస్తున్నదే కేంద్రం కదా అంటారేమో ! ఇవన్నీ నిష్టూరాలు కాదు. నిజాలే. కానీ నువ్ అనుకున్నట్టు రాజకీయాలు ఎల్లప్పుడూ సాగవ్. మనం అంచనా వేసకున్నట్టే పరిస్థితులు ఉండవ్. అసలు వచ్చే ఆరు నెలలు, ఏడాది కాలంలో కేంద్రంలో లెక్కలు ఎలా మారొచ్చు అనే దాంతో మొదలు పెడదాం. మార్చిలో యూపీ ఎన్నికలు ఉన్నాయ్. కేంద్ర ముఖచిత్రం ఎలా ఉంటుందో తేల్చే ఎన్నికలే ఇవి. ఇప్పటికైతే ఎలాగైనా యోగీ నెగ్గుకు వచ్చేస్తాడు అనుకుంటున్నారు అంతా. విపక్షం సాలిడ్ గా లేకపోవడం, ఎవరిని ఎలా కొట్టాలో తెలిసిన ఒడుపు యోగీకి ఉండటమే కారణం. కావొచ్చు. అదే జరిగితే కేంద్రంలో ఈక్వేషన్ చేంజ్ అయినట్టే. రెండోసారి యోగీ గెలిచాడూ అంటే ఇక నెక్ట్స్ టార్గెట్ ఢిల్లీనే. కేంద్రంలో కుర్చీని నిలబెట్టే రాష్ట్రాన్ని సాధించిన వాణ్ని నేనే అని యోగీ రానూ వచ్చు. పైగా అప్పటికి మోడీకి 74 దాటుతాయ్. 75 తర్వాత క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉండాలన్నది ఆయన చెప్పిన సూత్రమే. అదే చెప్పి ఆయన్ని పక్కన పెట్టాలని యోగీ యాగీ చేసినా చేయొచ్చు. యూపీలో యోగి గెలిచినా ఓఢినా కూడా ఈ మోడీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది కచ్చితంగా వచ్చి తీరుతుంది కేంద్రంలో ! పైపెచ్చు పెర్ఫామెన్స్ ఇండెక్సును బట్టీ చూస్తే మోడీ విషయంలో సంఘ్ సంతృప్తికరంగా లేదన్నది అంతర్గత చర్చ. సంఘ్ ను ఖాతరు చేయకుండా ఆయన వెశ్లిపోతున్నాడన్న టాక్ ఉండనే ఉంది. అన్నిటికీ మించి బీజేపీ 2024 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించలేకపోతే కొత్త మిత్రులు అవసరం పడితే మోడీని తప్పించాల్సిన పరిస్థితే వస్తుందమో ! అంటే బీజేపీ ఉండొచ్చు కానీ మోడీ ఉంటారా అనేది డౌటే !

ఇదే లెక్కన యోగీకి పోటీ ఇచ్చే నాయకుడు ఒక్క అమిత్ షా మాత్రమే. ఎందుకంంటే పార్టీపై అంతర్గతంగా పట్టు ఉండటంతోపాటు మోడీతో పోలిస్తే గత ఏడెనిమిది ఏళ్లలో దేశ వ్యాప్త వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పట్టూవిడుపులతో, మరీ ఎక్కువ కాకపోయినా కాస్తోకూస్తో అలాంటి ధోరణితో వెళుతున్నది ఒక్క షా మాత్రమే. బీజేపీ మెజారిటీ మార్కుకు దూరంగా ఉండిపోతే కొత్త మిత్రులు అవసరం పడితే రేసులో ఫ్రంటు రన్నర్ అమిత్ షా అవ్వొచ్చు. అప్పటికప్పుడు అన్నిపార్టీలూ నేరుగా బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా కొన్ని వెలుపల నుంచి, ఇంకొన్ని లోపల నుంచి అంటూ పావులు కదుపుతాయ్. కేంద్రంలో నేరుగా బీజేపీ పోయి, కాంగ్రెస్ వచ్చి కూర్చునే ఛాన్సు ఈ నిమిషానికి లేదు. ఇలాంటి మధ్యంతర కాలం అంటే… ట్రాన్సిషన్ పిరియడ్ కచ్చితంగా వస్తుంది. ఇలాంటప్పుడు సమాజ్ వాదీ, జేడీఎస్, తృణమూల్, సేన లాంటి పార్టీలతో సంధానకర్తల అవసరం ఉంటుంది. పైపెచ్చు 20కి పైగా ఎంపీలున్నవాడు ఎవడైనా హీరోనే. ఏపీలో మారే సమీకరణను బట్టీ అప్పటికి చంద్రబాబు కనుక ఆ లైన్ అవతల నిలబడగల్గితే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇప్పుడు బొరుసులా కనిపిస్తున్న రాజకీయం అప్పుడు అసలైన బొమ్మ చూపిస్తది.

Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)

అందుకే అమిత్ షా ఎప్పుడూ ఓ ఆప్షన్ పెట్టి ఉంచుతాడు. చంద్రబాబును నేరుగా కలవకలేకపోయినా ఫోన్ లో మాట్లాడ్డం, మీ పరిస్థితి అర్థం అవుతోంది… ఏపీ ఆర్థికంతోపాటు అంతా తెలుసు అనడం కూడా అందులో భాగమే. అప్పటికి రాష్ట్ర రాజకీయం తిరగబడితే అమిత్ షాకే అడ్వాంటేజ్ ఉంటుంది. మరి అలా అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి ? ఏపీకి ఏం కావాలి ? ప్రత్యేకంగా కావాల్సింది ఏం లేదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇంకో ఆరు నెలలు తర్వాత అంటే వేసవి తర్వాత ఓ అన్ రిట్టన్ అగ్రిమెంట్ లాంటిదేదో వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రతీ విషయంలోనూ మీరు ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రభుత్వానికి కొమ్ముకాయడం ఆపండి, వాళ్లపై జనంలో వ్యతిరేకత ఉంది. వచ్చేది మేమే… మాకు వచ్చే సీట్లతో మీకు మద్దతు ఇస్తాం 2024 తర్వాత అని టీడీపీ ప్రపోజల్ పెట్టనూ వచ్చు. అమిత్ షా తలూపనూ వచ్చు. ఎందుకంటే సరే అంటే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు. పైగా భవిష్యత్ అవసరం కోసం ఓ రిజర్వు పెట్టుకున్నట్టు ఉంటుంది తప్పితే నష్టం లేని ఏర్పాటు ఇది.

అలాగని బేజేపీతో నేరుగా టీడీపీ పొత్తు పెట్టుకుంటుందీ అని చెప్పలేం. కేవలం ఇప్పటి అధికారపార్టీకి వంతపాడటం తగ్గిస్తే అన్నీ వాటంతట అవే జరిగిపోతాయ్. జనసేన వచ్చి కలిస్తే కలవొచ్చు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఓటుపడే పరిస్థితి లేదు. అలాంటప్పుడు భావి మిత్రుల కోసం తగ్గినా నష్టం లేదు అని బీజేపీ రియలైజ్ అవ్వొచ్చు. ఆ విషయం ఇప్పటి అధికార పార్టీకి క్లియర్ గా తెలుసు. ఎందుకంటే 2017 నుంచి ఢిల్లీలో వాళ్లు నడిపిన ఈక్వేషనే ఇది. అది ఇఫ్పుడు తిరగబడి వాళ్లకే ఎసరు పెట్టవచ్చు అని అనుకోబట్టే… ప్రత్యేక హోదా అజెండా క్రమంగా తెరమీదకు వస్తోంది. ఇక ముందు ముందు చాలా ఉండబోతున్నాయ్ ఇలాంటివి. నన్ను ఒక్కణ్ని చేసి వీళ్లంతా అడ్డుకుంటున్నారు అని ఇప్పుడున్న నాయకుడు సింపతీ అజెండా తీసుకునే ఛాన్సు చాలా చాలా ఎక్కువ. తీసుకుంటే మాత్రం సాధించేది ఏం ఉంటుంది ? 150కిపైగా సీట్లు ఇచ్చిన తర్వాత ఇలాంటి సింపథీ జెండాలు, అజెండాలూ ఎగురుతాయా అనేది డౌటే ! పరిస్థితులు, పరిణామాలు ఇలా ఉండే అవకాశాలు చాలా చాలా సుస్పష్టం. అందుకే ఏపీ రాజకీయాల విషయంలో అమిత్ షా ముందు ముందు చాలా చాలా కీలకం. రెండు రోజులు తిరుపతిలో మకాం వేసే సమయంలో కొంత వరకూ ఆ దిశగా అడుగులు పడినా పడొచ్చు అనే అంచనాలు ఉన్నాయ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments