28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిబొజ్జల చేసిన పని తెలిసినా ఇలా కేకు కోస్తాడు ! దటీజ్ బాబు!

బొజ్జల చేసిన పని తెలిసినా ఇలా కేకు కోస్తాడు ! దటీజ్ బాబు!

చంద్రబాబు బొత్తిగా ఏ ఎమోషన్స్ లేని మనిషి, కాంట్రీట్ కండరాలూ, ఇనుప నరాలూ ఉన్నోడు అన్నట్టుగా ప్రచారం చేసీ చేసీ ముద్ర వేయాలని చూస్తారు ప్రత్యర్థులు. బాబు కూడా భావోద్వేగాలు ప్రదర్శించడం తక్కువే కాబట్టి కొన్ని కాదు చాలా సందర్భాల్లో వాస్తవాలు బయటకు రావు. బొజ్జల ఇంటికెళ్లి కేకు కట్ చేసి చేసిన బర్త్ డే సెలెబ్రేషన్ వైరల్ అవుతుండగా చూశాక ఓ సంగతి చెప్పాలనిపిస్తోంది. ఇలాంటప్పుడే బాబు మనసు లోతు ఎంతో, మెచ్యూరిటీ లెవెల్ ఎంతో అర్థం అవుతుంది. మిగితావాళ్లు మరుగుజ్జులన్న థాట్ రావొద్దన్నా వచ్చేస్తుంది. పైగా ఇది ఒకప్పుడు బొజ్జల స్వయంగా చెప్పిన విషయం కూడా !

చంద్రబాబు రెండోసారి గెలిచి ఊపు మీద ఉన్నాడు. తటస్థులు అనే ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాను అనుకుంటున్న రోజులు. అంటే వివిధ రంగాల్లో నిపుణులకి టిక్కెట్లు ఇచ్చి, వాళ్ల సేవల్ని రాజకీయాల్లో వాడుకోవాలన్నది ఆయన ఆలోచన. ఇండియన్ సర్వీసెస్ తోపాటు అనేక ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు బాబు పిలుపుతో రాజకీయంలోకి దిగారు. 99 అది. గెలిచాక, కేబినెట్ కూర్పు చేయడానికి ముందే తెలంగాణ ప్రాంతంలో అనుమానం మొలకెత్తింది. ఏరికోరి విజయరామారావును తెచ్చుకున్నడు కదనె, నాకు ఇస్తడా ? ఇవ్వకపోతే ఇక ఏదోఒకటి చేయాల్సిందే అన్నది అప్పటి చంద్రశేఖరరావు మాట. ఆ మాట అంటున్నప్పుడు చంద్రశేఖరరావు తోపాటు మరో ఐదారుగురు ఉన్నారు. అందులో బొజ్జల ఒకరు.

భయపడినంతా అయ్యింది. చంద్రశేఖరరావుకి చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. టీడీపీలో ముసలం పుట్టింది. వేరు కుంపటి పెట్టింది. చంద్రశేఖరరావు టీడీపీ నుంచి దూరం జరిగినా టీడీపీ నాయకులతో మాత్రం రాకపోకలూ సాయంత్రం పానీయాలూ ఆగలేదు. నేను పార్టీ పెడదామనుకుంటున్నా అని అలాంటి సాయంత్రం సమావేశంలోనే మొదట చెప్పాడు చంద్రశేఖరరావు. నా దగ్గర పైసల్లేవు, ఎట్లనె అనగానే… తను భాగంగా మైనింగ్ కంపెనీ నుంచి డబ్బు ఇచ్చే బాధ్యత బొజ్జల తీసుకున్నారు. చెప్పినట్టుగానే మూడు కోట్లు ముట్టచెప్పారు కూడా ! అంటే టీఆర్ఎస్ పుట్టింది ఆంధ్రాపెట్టుబడితో ! బొజ్జల సహకారంతో అనమాట. ఆ మాట టీడీపీలో చాలా మందికి తెలుసు.

ఆ నోటా ఈనోటా ఆ విషయం చంద్రబాబుకి చేరింది. బొజ్జలే ఇదంతా చేశాడు. పార్టీకి ఇబ్బంది కల్గించే పని చేశాడు అని పితూరీలు చెప్పడం ఎక్కువైంది. చంద్రబాబు అడుగుతాడేమో అని బొజ్జల కూడా ఎదురుచూశారు. ఎంతకీ చంద్రబాబు నుంచి ప్రశ్న రాకపోయే సరికి ఇక తనే బయటపడ్డాడు బొజ్జల. చంద్రబాబు రియాక్షన్ నిజంగా ఎపిక్. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సంబంధాలు వలుకోవాల్సిన అవసరం లేదు కదా, రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి, న్యక్తిగతాలకు పోకూడదు అని చంద్రబాబు అనడం కాదు, మాటలు కాదు. చేతల్లో చూపించాడు. బొజ్జలని పల్లెత్తు మాట అనలేదు. అంతెందుకు తన పార్టీని చీల్చి, తనను ఓ ప్రాంతానికి నెట్టిన చంద్రశేఖరరావు కనబడినప్పుడు కూడా – ఏమ్మా కేసీఆర్, ఎలా ఉన్నావ్ అని ఆత్మీయంగా పలకరించడం చంద్రబాబు తరహా ! రాజకీయం కోసం చెల్లెళ్లనే రోడ్ల మీదకు నెడుతున్న కాలంలో స్నేహితుడి సాయాన్ని చెప్పకుండానే అర్థం చేసుకున్నోడిని బహుశా చంద్రబాబు అంటారేమో ! ఒలింపిక్స్ లో మెచ్యూరిటీకే కనుక పోటీలు ఉంటే చంద్రబాబుకి ఎప్పుడో గోల్డ్ మెడల్ వచ్చి ఉండేదేమో ! పరిణతికి కరుకు బట్టలేసి నిలబెడితే చంద్రబాబులా ఉంటుందేమో అనిపించింది ఆ క్షణం. టీడీపీలో సీనియర్లకి తెలిసిన సంగతి ఇది.

అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు, బొజ్జల గురించి ఇలా మాట్లాడ్డం అవసరమా అంటారేమో ! నిజమే. అవసరమే ! నిజానికి ఈ ఘటన చెప్పిందే బొజ్జల. నేను అలా చేశానూ తెలిసి కూడా చంద్రబాబు ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాట అనలేదు. కనీసం అడగలేదు. నేనే ఉండబట్టలేక చెప్పేశాను. తెలుసులే, రాజకీయం వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు కదా, అంతా రాజకీయం కోసమే చేస్తామా నేను అర్థం చేసుకోగలను అని ఆయన అన్నప్పుడు ఆ మనసు లోతు నాకు ఆశ్చర్యం అనిపించింది – అన్నది బొజ్జల మాట. ప్రాణాలు తీసేవాళ్లను ప్రాణమిచ్చేవాళ్లుగా, హత్యా రాజకీయం నడిపిన వాళ్లను స్నేహ బాంధవులుగా, ఆత్మీయులుగా ముద్ర వేసుకున్న రాష్ట్రం మనది. అలాంటిది, వాస్తవం ఇది, నిజం ఇదీ, నా అనుభవం ఇదీ – అని బొజ్జల లాంటి పెద్దమనిషి స్వయంగా చెప్పినప్పుడు గుర్తు చేసుకోకపోతే ఎలా ! ఏమంటారు ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments