31 C
Vijayawada
Friday, April 26, 2024
Homeచాణక్య నీతిసానుభూతి చంద్రుడు అత్యంత బలవంతుడు ఎందుకో తెలుసా ?

సానుభూతి చంద్రుడు అత్యంత బలవంతుడు ఎందుకో తెలుసా ?

సాధారణ పరిస్థితుల్లో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుుడు… ఎవరి కంఫర్టు జోన్ లో వాళ్లు ఎంజాయ్ చేస్తున్నప్పుడు చంద్రబాబు ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు. టీడీపీ అధినేత. అదే చంద్రబాబు దాడుల్ని ఎదుర్కొంటున్నప్పుడు, బూతుల్ని భరిస్తున్నప్పుడు, కొట్లాటల్ని తట్టుకుంటున్నప్పుడు జనానికి సంబంధించిన మనిషి. అవుట్ అండ్ అవుట్ పీపుల్స్ లీడర్. చంద్రబాబు రాజకీయ మోడలే ఇది. దీన్ని అర్థం చేసుకోవడంంలో ఫెయిల్ అవ్వడం వల్లే చంద్రబాబును విక్టిమైజ్ చేయాలనుకోవడం.

చంద్రబాబు ఎగిరి దూకే రకం కాదు. అగ్రెస్సివ్ కానేకాదు. నిలబడటానికి టైమ్ తీసుకొని, నిలబడిన తర్వాత చితకాడేసే పాత తరం బ్యాట్స్ మన్. కనీసం 25 బంతులు ఆడితే కానీ ఖాతా తెరిచే రకం కాదు. కానీ 50 బంతులు ఆడాడో భారీ స్కోర్ ఖాయం. ద్రవిడ్ లాగా ! అలాంటప్పుడు ఏం చేయాలి? ఎలా ఫేస్ చేయాలి ? సాధ్యమైనంత వరకూ నాన్ స్ట్రైకింగ్ లో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. సింపుల్. అవతల వికెట్లు తీసుకుంటూ ఉంటే అయిపోయె. అంతే కానీ బాబును క్రీజులోకి పిలిచి… బౌన్సర్లతో కొట్టి సంబరపడితే నిలబడి పోతాడు. లోపలున్న ఆ గ్రిట్, కమ్మిట్మెంట్ బయటకు వచ్చేస్తది. పోయిన యాషెస్ లో స్టీవెన్ స్మిత్ ను కొట్టి కొట్టి… ఇంగ్లండ్ సిరీస్ ఓడిపోయినట్టే ఉంటుంది రిజల్ట్. ఎందుకంటే నువ్ బంతితో కొట్టావ్. వాడు బ్యాటుతో కొట్టాడు. దటీజ్ ద మేటర్.

చంద్రబాబును కొట్టడంలో, ఇబ్బందులు పెట్టడంలో ఎప్పుడూ ప్రత్యర్థుల గెలుపు లేదు. గెలవలేరు. మొదట్లో వైఎస్ బాబును ఇబ్బంది పెట్టొచ్చు అనే అనుకున్నాడు. కేసులు పెట్టాడు. విచారణలు వేశాడు. రెండు డజన్ల ఎంక్వైరీలు కూడా ఏం చేయలేక పోయేసరికి 2009 తర్వాత మోడల్ మార్చాడు. బాబును వదిలేసి ఆపరేషన్ ఆకర్ష్ అంటూ లీడర్లను లాగడం మొదలు పెట్టడానికి కారణం ఇదే. బాబును కొడితే బలపడిపోతాడు. చిరంజీవి వచ్చి ఆదుకోబట్టి వైఎస్ నిలిచాడు కానీ లేకపోతే కథ వేరు కదా ! అది మరోసారి మాట్లాడదాం. వైఎస్ హయాం తర్వాత కాంగ్రెస్ మళ్లీ పాత గేమ్ మొదలు పెట్టింది. చంద్రబాబు టార్గెట్ గా రాజకీయాలు, విభజన అస్త్రాలు అన్నీ నడిచాయ్. బాబు పని అయిపోయింది అన్నారు. కానీ టీడీపీ మెజారిటీ ప్రాంతంలో జెండా ఎగరేసింది. ఎందుకంటే చుట్టుముట్టిన సవాళ్లను తట్టుకోవడం ఎలాగో బాబుకి తెలుసు. అసలు రంగంలోకి దిగాడు అంటేనే అర్థం జనం ఇబ్బందుల్లో ఉన్నారు, ఆక్రోశంలో ఉన్నారు అని. అందుకే 2014లో కొత్త పార్టీల మోజు, పాత పార్టీల బూజు ఐడియాలూ పని చేయలేదు. బాబే గెలిచాడు. ఎందుకంటే బాబు జనం పక్షం.

ఇప్పుడు కూడా అంతే. చంద్రబాబును పెద్దగా పట్టించుకోకుండా, పని చేసుకుంటూ పోతే, మిగిలిన కొద్ది మంది ఎమ్మెల్యేలను కూడా లాగేసుకుంటూ పోతే సరిపోయేది. అడిగే నాథుడు ఏడి ? ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అంతా వాళ్లదే హవా. ఫుల్లు సపోర్టు కూడానూ ! అలాంటి అవకాశాన్ని వదిలి, బాబును కొట్టడం మొదలు పెట్టడం దేనికి ? ఇంత పవర్ చేతిలో ఉనప్పుడు… పవర్ లేనోడితో పరాచకాలు ఎందుకు ? రాంగ్ స్ట్రాటజీ. ఆఫీసులపై దాడులతో ఆగలేదు వ్యవహారం. పర్సనల్ గా బూతులు, పుట్టుక గురించి మాట్లాడే మాటలు వింటే చంద్రబాబు మీద పెద్దగా సాఫ్ట్ కార్నర్ లేని వాళ్లు కూడా ఖండించక తప్పని పరిస్థితి. అంటే పాత బలాన్ని కూడగట్టుకోవడమే కాదు కొత్తగా బేస్ ఏర్పాటు చేసుకునే స్కోప్ కూడా ఇస్తున్నట్టు. ఇదే అవకాశంగా తీసుకుంటున్నాడు చంద్రబాబు. ఎప్పుడూ లేనిది ఢిల్లీ వెళ్లొచ్చాడు, ఇప్పుడు జనంలోకి వెళుతున్నాడు… ఎంత వరకూ అయినా పోరాడటానికి సిద్ధం అంటున్నాడు. ఇక నుంచి పెద్దగా గేమ్ ప్లాన్ కూడా అక్కర్లేదు. జనం ఏమనుకుంటున్నారో అదే మాట్లాడితే సరిపోతుంది.

ఇక, అన్నిటికీ మించి సవాళ్లను ఎదుర్కోవడంలో బాబుకి ఓ స్టైల్ ఉంటుంది. చూడ్డానికి పాస్సివ్ గా ఉంటుందది. సొంత వాళ్లకే విసుకు పుడతది కొన్నిసార్లు. మరీ ఇంత ఓపిక ఎందుకు సామీ అని నిరసన చెప్పాలనిపిస్తది. కానీ అదే ఓపికతో ఓడిస్తాడు బాబు ఎదుటివాణ్ని. దెబ్బలు కొడితే తిరిగి కొట్టడం సంగతి పక్కన పెట్టు, ఇదిలో ఇలా కొట్టాడు… కరెక్టా, మీరు సమర్థిస్తారా అని అడుగుతాడు. చూపిస్తాడు. యాగీ చేసేస్తాడు. రేపు మీ వరకూ వస్తే ఏం చేస్తారు అని ఆలోచన రేకెత్తిస్తాడు. ఇప్పుడు సరిగ్గా ఇదే స్టేజీలో ఉంది ఎత్తుగడ. అవును, రానీయండి… కొట్టించుకునేందుకు మేం సిద్ధం అని చెప్పే వాళ్లు తప్ప మిగతా వాళ్లంతా బాబు పక్షమే ! పార్టీ రంగులుండవ్. బాధిత పక్షం ఒకటే ఉంటుంది. బాధితుల దెబ్బకి బలం ఎక్కువ. సో, చెప్పొచ్చేది ఏంటంటే, పక్క పాపిట తీసుకొని, కరుకు కాటన్ తొడుక్కొని సెన్సిటివ్ గా కనిపిస్తున్నాడు కదా అని కెలుక్కుంటూ పోతే బాబుకి కాదు ఇబ్బంది. వాళ్లకే టెన్షన్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments