34 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిహెచ్చరిక ప్రభావం ఇంత ఉంటుందా ?

హెచ్చరిక ప్రభావం ఇంత ఉంటుందా ?

ఢిల్లీలో స్విచ్ నొక్కితే రాష్ట్రంలో లైట్ వెలుగుతుంది అనే మాట కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వినపడేది. ఇప్పుడు అక్కడ బీజేపీ. మరి రాష్ట్రంలో స్విచ్ నొక్కేసరికి ఢిల్లీలో కదలిక మొదలైందా ? కేంద్రం అంతా గమనిస్తోంది, హోం శాఖ చిట్టా సిద్ధం చేస్తోంది. అందరి జాతకాలూ తేలే రోజు వస్తుందని ఎంపీ సుజనా చౌదరి పది రోజుల్లో రెండు సార్లు హెచ్చరిక స్వరంతో మాట్లాడ్డం, కేంద్ర మంత్రి జావడేకర్ కూడా బెయిల్, జెయిలు అంటూ రిథమిక్ గా కామెంట్ చేయడం చూశాక ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతోంది అనే ఆసక్తి పెరిగిపోయింది. ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు ? కొత్త ఏడాది కదా, విష్ చేయడానికి కలుస్తా అని – అదే అధునుగా విన్నపాలు, వేడుకోలు చేయడానికేనా ?

ఏ పార్టీ వారైనా, ఏ కూటమిలో ఉన్నా లేకపోయినా ఎవరైనా ప్రధానిని కలవొచ్చు. చెప్పేది చెప్పుకోవచ్చు. అడిగేది అడగొచ్చు. కానీ కలిసే టైమ్ ను బట్టీ ఏం మాట్లాడారు, ఎందుకు కలిశారు అనే చర్చ ఉంటుంది ఎప్పుడైనా ! బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఏదైనా చెప్పొచ్చు. లోపల మేటర్ ఏంటనేదే పాయింట్ ! ఏపీలో బీజేపీ ఇప్పుడిప్పుడే కూతకొస్తోంది. మొన్నటి వరకూ అధికార పార్టీ అనుబంధ విభాగమా అన్నట్టు కనిపించిన పార్టీ ఇప్పుడు వార్నింగులు ఇచ్చే వరకూ వెళుతోంది. గత వారం విజయవాడలో సభ పెట్టి, కీలక నేతలు మాట్లాడిన తీరు చూస్తే ఏదో జరుగుతోంది అనే ఆలోచన కలిగింది. అటు వాళ్లకి కూడా అలాగే అనిపించింది. కాబట్టే అమిత్ షా మంత్రిగా ఉన్న హోం శాఖ గురించి మాట్లాడ్డానికి ఈయన ఎవరు అంటూ మంత్రులు సజనా చౌదరిపై విరమ్శలు చేశారు. అంటే సెగ తాకడం మొదలైంది అనేందుకు ఇదే సంకేతం. ఏదైనా ఇలాంటి కదలిక చూసినప్పుడు, ఢిల్లీ వెళ్లి కలవడం, శాలువాలు కప్పడం, ఫోటోలు దిగి ట్విట్టర్ లో పెట్టడం ముందు నుంచి అలవాటు. అంతా కంట్రోల్లోనే ఉందని చెప్పుకోడానికి వాళ్లు పడే తాపత్రయం అది. కానీ కేంద్ర మంత్రే బెయిలు కామెంట్ చేశాక లైట్ తీసుకోడానికి లేదు. పైగా, రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయ్, సరిగ్గా అడుగులు వేస్తే చాలా దూరం వెళ్లొచ్చని పరిస్థితిని సుజనా లాంటి వాళ్లు వివరించాక ఇక లెక్క మారి ఉండొచ్చు అనేది గుబులు. భయం. ఆందోళన.

అవకాశం ఉంటే బీజేపీ ఎందుకు వదులుకుంటుంది ? అన్ని కూసాలూ కదిపో, మిగతా పార్టీలతో కలిసో మొత్తానికి ఏదో ఒకటి చేస్తుంది. ఇన్నాళ్లూ ఉన్నట్టు, మన్ను తిన్న పాములా అయితే పడి ఉండదు కదా ! అదే అసలు టెన్షన్. ఇన్నాళ్లూ అడిగినంత అప్పు పరిమితి పెంచింది. అవకాశాలు అందించింది. అలా కేంద్రం చేసిన సాయాలే ఇప్పుడు అధికార పార్టీకి గాయాలుగా తయారైయ్యాయ్. ఏపీకి పీకల్లోతు అప్పులు మిగిలాయ్. చేతిలో పైసా లేదు. ఇంతలో మళ్లీ బీజేపీ పావులు కదిపి, రాజకీయంగా గేరు మార్చితే ఊపిరి సలపదు. అందుకే కంగారు. అప్పులు తెచ్చేందుకు సాయం చేశారు కదా అని అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటుందా బీజేపీ – అంటే అవును అని చెప్పలేం. ఏపీకి అర్థం అయ్యే ఓ ఉదాహరణ చూస్తే, మనకి పిక్చర్ క్లారిటీ వచ్చేస్తది.

అధికార పార్టీ మీద తిరగబడి రోజూ ప్రెస్ మీట్లతో మోతమోగించే గోదావరి జిల్లా ఎంపీ సంగతే చూడండి. ఆయన బీజేపీకి బాగా సన్నిహితం కూడా. మా సీఎం కంటే నేనే బెటర్, నేను అడగ్గానే అప్పాయింట్ మెంట్ ఇస్తుంది పీఎంవో అని జోకులు కూడా వేస్తాయడాయన. అంత చనువు ఉన్నా సరే, 948 కోట్ల బ్యాంకు రుణాల కేసులో సీబీఐ ఛార్జి షీట్ వేసి, తన పని తాను చేస్తోంది. పైగా విచారణ అధికారులు ఎయిర్ ఇండియా విమానాల్లో తిరిగితే ఖర్చులు కలిసొస్తాయ్ అంటూ గైడ్ లైన్స్ కూడా పెట్టింది. ఖర్చుల అదుపు, నిధుల పొదుపు కోసం అనమాట. బీజేపీ పాలసీలు ఇలాగే ఉంటాయ్ ఒక్కోసారి. రాజకీయంగా తమకి ఏమీ లేని రాష్ట్రంలో తనంతట తాను వచ్చి కౌగిలించుకున్న ఎంపీ విషయంలోనే ఇలా ఉంటే, ఓడిపోతుంది అని రూఢి అవుతున్న పార్టీ విషయంలో ఇంకెంత అంటీ ముట్టనట్టు ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి కదా ! అలాగని ఇప్పటికిప్పుడు ఏం చేస్తుంది, చేయదు అన్నది కాదు చర్చ. చట్ట ప్రకారం ఎలా జరగాలో అలా జరిగే వెసులుబాటు ఇస్తే చాలు కదా. జరగాల్సింది జరుగుతుంది. అధికార కూటముల్లో భాగస్వాములుగా ఉన్నా, కేసుల నుంచి తప్పించుకోలేక – దోషులుగా శిక్షలు అనుభవించిన జయ, లాలూలను చూసిన దేశం మనది. ఇంతకన్నా ఎక్కువ చెప్పుకోనక్కర్లేదు. అందుకే సుజనా, జావడేకర్ లాంటి నేతల మాటలకు అంత పదును.

రాజకీయాల్లో 0.6 పర్సెంటుగా కనిపిస్తున్న పార్టీకి కూడా ఎదిగి, ఓ ఊపు ఊపేందుకు అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ కీలక సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, మైనస్ గాళ్లని ఎలా తగ్గించుకుంది, ప్లస్ అయ్యే వాళ్లను ఎలా పెంచుకుంది అనేదే కౌంట్ అవుతుంది ఎప్పుడైనా. ఇక్కడో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. చిన్న పెట్టుబడితో మొదలై ఫేస్ బుక్ ప్రపంచాన్ని ఎలా కమ్మేసిందనే మోడల్ ను వివరించి చెప్పే జీ టు వన్ అన్ పుస్తకం ఒకటి ఉంది. జీరో వన్ పక్క పక్కనే ఉన్నట్టుగా ఉంటాయ్ కానీ వాటి మధ్య చాలా దూరం ఉంది. జీరో అంటే నథింగ్ అని. వన్ అంటే నంబర్ వన్ అని. అంటే, నథింగ్ తో మొదలై… అందరినీ దాటుకుంటూ నంబర్ వన్ గా ఎదగడం అనమాట. ఏపీలో బీజేపీ కూడా అలా ఆలోచించగలిగితే భవిష్యత్ ఉంటుందేమో ! ఏకంగా నంబర్ వన్ పార్టీ కాలేకపోయినా, నంబర్ గా నిలిచే కూటమిలో ఒక పార్టీ అయితే అవ్వొచ్చు కదా ! సాధ్యమే. అలా అవ్వాలీ అంటే వేసే ప్రతీ స్టెప్ లోనూ క్లారిటీ, తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ స్టెబిలిటీ ఉండాలి. ఇప్పుడు చేస్తున్న హెచ్చరికలకు అప్పుడే విలువ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments